గతంలో బాలయ్య ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. అందులో `భైరవ ద్వీపం` కి ప్రత్యేక స్థానం ఉంటుంది. `ఆదిత్య 369` వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీని ప్రేక్షకులకు అందించిన ఘనవిజయం అందుకున్న బాలయ్య-సింగీతం కాంబోలో వచ్చిన మూవీ కావడంతో… ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.1994 వ సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను మ్యాచ్ చేస్తూ సూపర్ హిట్ అయ్యింది.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ప్రేక్షకులకి ఈ మూవీ కొత్త అనుభూతిని అందించి ప్రశంసలు అందుకుంది. 9 విభాగాల్లో ఈ మూవీ `నంది` అవార్డు పురస్కారాలను కూడా అందుకుంది. బాలకృష్ణ కి జోడీగా రోజా నటించగా.. బాలయ్యకి తల్లిగా కేఆర్ విజయ నటించారు. విజయ్ కుమార్, కైకాల సత్యనారాయణ, సంగీత, విజయ రంగ రాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్, మిక్కిలినేని, సుత్తి వేలు, కోవై సరళ, వినోద్, పద్మనాభం వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.
రంభ, రవళి స్పెషల్ సాంగ్స్ లో మెరిశారు. అంతా బానే ఉంది కానీ.. ఈ మూవీ విడుదల రోజున పెద్ద రచ్చ జరిగిందట. విషయం ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ లో బాలయ్య వింత అవతారంలో కనిపిస్తారు. శాపానికి గురవ్వడం వలన ఆయన పాత్రకి ఆ రూపం వచ్చినట్టు చూపిస్తారు. కానీ బాలయ్య ఫ్యాన్స్ ఆ గెటప్ ను జీర్ణించుకోలేకపోయారట. థియేటర్ల లో కుర్చీలు విరగొట్టి.. షోలు ప్రదర్శించకుండా అడ్డుపడ్డారట.
అయితే తర్వాతి రోజు దర్శకనిర్మాతలు ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టి.. దానికి వివరణ ఇచ్చి అభిమానులకి క్షమాపణల్ని తెలియజేసారట.నేటితో ఈ చిత్రం విడుదలై 28 వసంతాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో ఈ విషయం బయటపడింది.