Unstoppable with NBK: మరోసారి అలరించేందుకు బాలయ్య రెడీ.. ఈసారి గత సీజన్‌లా కాదట..
- August 10, 2024 / 01:01 PM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ (Balakrishna) అంటే సకుటుంబ సరపరివార సమేతంగా అందరినీ అలరించే హీరో. అలాంటి హీరోను నేటితరం ఎంటర్‌టైన్మెంట్‌కి దగ్గర చేసిన షో మాత్రం ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable with NBK) . రెండు రెగ్యులర్ సీజన్లు + ఒక స్పెషల్ సీజన్‌తో ఇప్పటివరకు బాలయ్య అలరించాడు. తన వయసు వాళ్లు, తన కంటే చిన్నవాళ్లు అయిన సినిమా జనాలు, కొందరు రాజకీయ నాయకుల్ని షోకి తీసుకొచ్చి అదరగొట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడో ఎడిషన్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు.
Unstoppable with NBK

అవును, ‘అన్‌స్టాపబుల్ 3’కి అంతా రెడీ అయిందట. బాబీ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో మూడో ‘అన్‌స్టాపబుల్’ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. ఈ మేరకు అధికారికంగానే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో ఎడిషన్‌కి ఎవరెవరు గెస్టులుగా రావొచ్చు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే మొదటి రెండు షోల్లో రానివాళ్లు, మిస్ అయినవాళ్లు ఈ సీజన్‌లో కవర్ చేయాలని ఆహా టీమ్ అనుకుంటోందట.

ఈ క్రమంలో చాలా మంది నటులు, రాజకీయవేత్తలు, క్రీడాకారుల పేర్లు గెస్టుల లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. అలాగే గతంలో ‘మేం రెడీ’ అంటూ మాటిచ్చిన వాళ్లు కూడా ఈసారి వస్తారని చెబుతున్నారు. ఇక ఈ సారి పాన్ ఇండియా లెవల్‌లో నటులు షోకి వచ్చి అలరిస్తారు అని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో తొలుతగా వినిపిస్తున్న పేర్లు చిరంజీవి (Chiranjeevi) – రామ్‌చరణ్ (Ram Charan) . మరి ఇద్దరూ కలసి వస్తారా? లేక వేర్వేరుగా వస్తారా అనేది ఆసక్తికరం.

ఇక రాబోయే ఆరు నెలల్లో సినిమాలు చూస్తే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. వాళ్లు ఈ షోకి రావొచ్చు అనేది టాక్. ఆ లెక్కన చూస్తే నాని (Nani) , దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , అల్లు అర్జున్ (Allu Arjun) , సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) , నితిన్ (Nithin) లాంటి పేర్లు టాలీవుడ్ నుండి వినిపిస్తున్నాయి. అయితే ‘దేవర’ (Devara) నేపథ్యంలో తారక్ ఏమన్నా వస్తాడా అనేది కూడా చూడాలి. వీటిపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుంది. ఈసారి 13 ఎపిసోడ్‌లు ఉంటాయి అంటున్నారు.

















