ఈ మధ్య మెగా హీరోల సక్సెస్ రేట్ కాస్త తగ్గిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు. పోటీగా తనకంటే సీనియర్ హిరోలున్నా… తన ఫ్యామిలీ హీరోలే ఉన్నా… సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ విషయంలో ఓ సెంటిమెంట్ రన్ అవుతుంది. అసలేంటి ఆ సెంటిమెంట్..? దానికి గల కారణమేంటి..? అనేగా మీ డౌట్.
విషయంలోకి వెళితే… గత సంవత్సరం(2018) లో సాయి ధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలయ్యింది. ఇక మన వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం ఫిబ్రవరి 10న విడుదలయ్యింది. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్, వినాయక్ డైరెక్షన్లో వచ్చిన చిత్రమే హిట్టవుతుందని అందరూ అనుకుంటారు.కానీ కొత్త డైరెక్టర్ తో చేసిన వరుణ్ తేజ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సంవత్సరం కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. ఈ సంక్రాంతి కి ఎన్నో అంచనాల నడుమ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘వినయ విధేయ రామా’ చిత్రం జనవరి 11 న విడుదలయ్యింది. ఇక వరుణ్ తేజ్ ‘ఎఫ్2’ చిత్రం జనవరి 12 న విడుదలయ్యింది. రాంచరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా కాబట్టి ‘వినయ విధేయ రామా’ చిత్రమే భారీ విజయం సాధిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ కట్ చేస్తే ‘వినయ విధేయ రామా’ చిత్రం డిజాస్టర్ కాగా ‘ఎఫ్2’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా వరుణ్ తేజ్ సైలెంట్ గా వచ్చేసి మెగా హీరోలతో పోటీ పడి మరీ సక్సెస్ లు అందుకుంటున్నాడు. రాను.. రానూ.. మెగా హీరోలకు ఇదో సెంటిమెంట్ గా మారుతుందేమో అని కొందరు ఫిలిం విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మెగా హీరోలకు వరుణ్ తేజ్ తో క్లాష్ అంటే.. కొంచెం కష్టమేనెమో..!