తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ‘ఎల్లమ్మ’ ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సెన్సేషనల్ హిట్ ‘బలగం’ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.మొదట్లో హీరోగా నాని పేరు వినిపించడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నితిన్ పేరు ఖరారైందని ప్రచారం జరిగినా, ఆయన కూడా బయటకు వచ్చారన్న రూమర్లు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. దీంతో అసలు సినిమా జరుగుతోందా? హీరో ఎవరు? అనే సందేహాలు బలంగా వినిపించాయి.
ఈ నేపథ్యంలో నిన్న (జనవరి 14) ‘ఎల్లమ్మ’ చిత్ర యూనిట్ నుంచి వచ్చిన పోస్టర్ ఒకటి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఈరోజు జనవరి 15 సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ గ్లింప్స్ ద్వారా కథా నేపథ్యం, టోన్, అలాగే సినిమా ప్రస్తుతం ఉన్న దశపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

హీరోయిన్ విషయంలోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదట కీర్తి సురేష్ పేరు వినిపించినా, ఆమె స్వయంగా ఆ వార్తలను ఖండించారు. గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ అంశంపై క్లారిటీ రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాపై, బలగం తర్వాత వేణు యెల్దండి మరో బలమైన కథతో వస్తాడన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. జనవరి 15న వచ్చే గ్లింప్స్… ఎల్లమ్మపై ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందా? లేదంటే కొత్త ఆసక్తిని రేపుతుందా? చూడాలి.
