లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ దంపతులు జూన్ 9వ తేదీ వివాహం చేసుకోవడం జరిగింది. ఇలా వీరికి పెళ్లయిన నాలుగు నెలలకే పిల్లలు పుట్టారని తెలియచేయడంతో ఈ విషయం తీవ్ర వివాదాలకు కారణమైన విషయం మనకు తెలిసిందే. పెళ్లి జరిగిన నాలుగు నెలలకే పిల్లలు పుట్టడం ఏంటి అని కొందరి విమర్శలు చేయగా మరి కొందరు మాత్రం సరోగసి నిబంధనలను ఉల్లంఘించి వీరు పిల్లలకు జన్మనిచ్చారు అంటూ పెద్ద ఎత్తున వీరి గురించి నెగటివ్ కామెంట్లు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఈ విధంగా ఈ జంట పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవడంతో ఏకంగా తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది.ఇలా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని వీరికి నోటీసులు అందించినప్పటికీ ఈ విషయంపై ఇంకా నయనతార దంపతులు ఏమాత్రం స్పందించలేదు అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా విగ్నేష్ ఈ విషయంపై విగ్నేష్ స్పందిస్తూ ట్రోల్లర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఇది నిజం.. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని కేర్ చేస్తారో.. మిమ్మల్ని నమ్ముతారు.. మీకోసం ఉంటారో వారి మాటలను మాత్రమే నమ్మండి. వాళ్లే మీ వాళ్ళు అంటూ ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.ఇకపోతే నయనతార విగ్నేష్ కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే హీరో కార్తీ వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్ట్ చేశారు. వెల్కమ్ టు పేరెంట్ హుడ్ నయన్ అండ్ విక్కీ మీ నలుగురికి ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి అంటూ ఫ్లవర్స్ పంపించారు. ప్రస్తుతం కార్తీ చేసిన ఈ పోస్ట్ కూడా విగ్నేష్ థాంక్యూ చెబుతూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.