Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!
- June 26, 2025 / 07:07 PM ISTByPhani Kumar
‘పిచ్చైకారన్’ (Pichaikkaran) అనే తమిళ సినిమాని ‘బిచ్చగాడు’ (Bichagadu) గా తెలుగులో రిలీజ్ చేసారు. వెంకటేష్ (Venkatesh) తో శీను (Seenu) అనే సినిమాని తెరకెక్కించిన శశి ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా 2016 లో వచ్చి ఊహించని విధంగా పెద్ద విజయం సాధించింది. కోటి రూపాయల బడ్జెట్ లో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు పైనే కలెక్ట్ చేసింది.
Vijay Antony
ఆ తర్వాత విజయ్ ఆంటోనీ (Vijay Antony) నుండి చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏదీ కూడా బాక్సాఫీస్ వద్ద చప్పుడు చేయలేదు. అయినా చాలా విజయ్ ఆంటోనీ (Vijay Antony) సినిమాలు చేస్తూనే వచ్చాడు. ఆడియన్స్ పట్టించుకోవడం మానేశారు. సరిగ్గా ఇలాంటి టైంలో ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) చేశాడు విజయ్ ఆంటోనీ.

- 1 Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!
- 2 Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!
- 3 Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!
- 4 Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు
ఇది అతనికి ట్రంప్ కార్డు మాదిరి బాగానే కలిసొచ్చింది. అందుకే ‘బిచ్చగాడు 3’ ని కూడా అదే టైంలో అనౌన్స్ చేసేశాడు. కానీ తర్వాత దాని గురించి చప్పుడు లేదు. అయితే ఈరోజు జరిగిన ‘మార్గన్’ మూవీ ప్రమోషన్స్ లో… ‘మళ్ళీ మీ డైరెక్షన్‌లో మూవీ ఎప్పుడు ఆశించొచ్చు?’ అంటూ ఓ రిపోర్టర్ విజయ్ ఆంటోనీని ప్రశ్నించడం జరిగింది.

దానికి విజయ్ ఆంటోనీ (Vijay Antony) తడుముకోకుండా.. ‘బిచ్చగాడు 3’ (Bichagadu 3) అంటూ చెప్పాడు. అంతేకాదు ‘2027 సమ్మర్ కి ‘బిచ్చగాడు 3′ రిలీజ్ అవుతుంది’ అని కూడా ప్రకటించేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ‘బిచ్చగాడు’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘బిచ్చగాడు 2’ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో పార్ట్ 3 కూడా మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
















