Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కెరీర్ గురించి ఎవ్వరికీ తెలియని విషయం చెప్పిన రవిబాబు
- June 10, 2024 / 04:56 PM ISTByFilmy Focus
‘విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఏంటి? పూర్ణకి భర్తగా ఏంటి?’… పైన హెడ్డింగ్ చూడగానే అందరి మైండ్లో ఇదే తిరుగుతూ ఉండొచ్చు. ఆ విషయం తెలుసుకోవాలి అంటే మనం 2012 కి వెళ్ళాలి. ఆ ఏడాది రవిబాబు (Ravi Babu) దర్శకత్వంలో ‘అవును’ అనే సినిమా వచ్చింది. తక్కువ బడ్జెట్లో రూపొందిన సినిమా ఇది. టాక్ కూడా బాగానే వచ్చింది. సో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించే సక్సెస్ అందుకుంది. క్లైమాక్స్ అందరికీ ఓ కొత్త అనుభూతి కలిగించింది అని చెప్పాలి.
ఆ తర్వాత 2015 లో ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘అవును 2 ‘ కూడా వచ్చింది. అది పెద్దగా ఆడలేదు. ‘అవును’ సినిమా పూర్ణకి (Poorna) మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఆమె భర్తగా హర్షవర్ధన్ రానే (Harshvardhan Rane) నటించాడు. అతని పాత్రకి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే హర్షవర్ధన్ రానే పాత్ర ముందుగా విజయ్ దేవరకొండ కోసం అనుకున్నారట. 2012 టైంలో విజయ్ దేవరకొండ అంటే ఎవ్వరికీ తెలీదు. అయితే రవిబాబు డైరెక్షన్లో రూపొందిన ‘నువ్విలా’ (Nuvvila) అనే సినిమాలో ఇతను నటించాడు.

అందువల్లే అతనికి ‘అవును’ లో ఛాన్స్ వచ్చింది. కానీ చివరి నిమిషంలో విజయ్ దేవరకొండని తప్పించి హర్షవర్ధన్ రానేని ఫైనల్ చేసాడట దర్శకుడు రవిబాబు. ఓ ఇంటర్వ్యూలో అతను ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ” ‘అవును’ సినిమాలో పూర్ణకి భర్తగా విజయ్ దేవరకొండని ఎంపిక చేసుకోవాలి అనుకున్నాం. కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అది వర్కౌట్ కాలేదు. దీంతో హర్షవర్ధన్ రానేతో ఆ పాత్ర చేయించడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చాడు రవిబాబు.

‘అవును’ మిస్ అయినంత మాత్రాన విజయ్ దేవరకొండకి పోయింది ఏమీ లేదు. ‘కేరింత’ (Kerintha) వంటి హిట్ సినిమాలని కూడా అతను మిస్ చేసుకున్నాడు. అయితే సొంత టాలెంట్ తో అతను స్టార్ గా ఎదిగాడు.. ఈరోజు రూ.20 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు. ప్రస్తుతం అతను 2 సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.













