పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule) విడుదలకు ఇంకా కొద్దీ రోజులు ఉండగానే, అభిమానుల్లో పుష్ప ప్రాంచైజీపై ఆసక్తి తారాస్థాయికి చేరింది. ఇప్పటికే రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నా, మూడో పార్ట్ గురించి చర్చలు కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి. రీసెంట్‌గా ఓ ఆసక్తికరమైన లీక్ రావడంతో, పుష్ప 3 మూడో పార్ట్ తప్పనిసరిగా ఉంటుందని మరోసారి స్పష్టమైంది. ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి తన టీమ్‌తో కలిసి షేర్ చేసిన ఓ ఫొటో ఈ చర్చలకు ఆజ్యం పోసింది. పుష్ప 2 సౌండ్ వర్క్‌లో భాగంగా, బ్యాక్‌డ్రాప్‌లో కనిపించిన “పుష్ప 3: ది ర్యాంపేజ్” టైటిల్ కార్డ్ అభిమానులను షాక్‌కు గురి చేసింది.
Pushpa
ఈ ఫోటో కాసేపటికే డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ లీక్ వలన పుష్ప 2 ముగింపులోనే మూడో భాగానికి గట్టి సంకేతాలు ఉండబోతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై గతంలో విజయ్ దేవరకొండ 2021లోనే హింట్ ఇచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌లో “2021 – ది రైజ్ (Pushpa) , 2022 – ది రూల్, 2023 – ది ర్యాంపేజ్” అని పేర్కొనడం చర్చకు దారితీసింది.
ఇప్పుడు రసూల్ లీక్‌తో దేవరకొండ (Vijay Devarakonda) ట్వీట్ నిజమవుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాత వై. రవిశంకర్ (Y .Ravi Shankar) ఇటీవల మాట్లాడుతూ, “పుష్ప 2 విజయవంతం అయితే, పుష్ప 3 ఉంటుంది. రెండో భాగం క్లైమాక్స్‌లోనే మూడో భాగానికి లీడ్ ఉంటుందంటూ” క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ (Allu Arjun) కూడా గతంలో “పుష్ప” సినిమాను ఫ్రాంచైజీగా తీర్చిదిద్దే ఆలోచన ఉందని పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. బర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ ప్రాజెక్ట్‌పై బన్నీ చేసిన వ్యాఖ్యలు ఈ హైప్‌ను మరింత పెంచాయి.
‘పుష్ప 2’లోని క్లైమాక్స్ కంటెంట్, అభిమానుల స్పందన ఆధారంగా మూడో భాగాన్ని సుకుమార్ (Sukumar) త్వరలోనే డెవలప్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుకుమార్ ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “మీ హీరో మళ్లీ మూడేళ్లు నా కోసం కష్టపడితే పుష్ప 3 చేస్తాను” అని చెప్పడం మూడో భాగంపై క్లారిటీ ఇచ్చింది. “పుష్ప 3: ది ర్యాంపేజ్” పాన్-ఇండియా మాత్రమే కాదు, పాన్-వరల్డ్ హైప్‌కు దారి తీస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.