ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం విజయ్ తో కలిసి ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కరోనా వైరస్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు వివరించాడు విజయ్. షేక్ హ్యాండ్ లు వద్దు పద్దతిగా నమస్కారం పెట్టాలని సూచించారు. ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతూ ఉంటే వారికి మూడగుల దూరంగా ఉండాలని విజయ్ సూచించాడు.ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో తిరగకపోవడమే మంచిదన్నారు.
అంతేకాకుండా వ్యాధి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్టు అనిపిస్తే 104 కి కాల్ చేసి, డాక్టర్ ని సంప్రదించాలని విజయ్ దేవరకొండ కోరాడు.