పాన్ ఇండియా పరిస్థితులు వచ్చాక ఓ మోస్తరు పెద్ద సినిమా అనుకున్నదానిని కూడా ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. పుట్టుకతో పాన్ ఇండియా సినిమాలే అన్ని చోట్లా ఆడాయి తప్ప.. ఆ తర్వాత హైప్‌ను పెంచుకుంటూ పాన్ ఇండియా స్థాయి పొందిన సినిమాలకు అయితే విజయం దక్కడం చాలా తక్కువ. ‘కింగ్డమ్’ సినిమా టీమ్‌కు ఎలా పాన్ ఇండియా స్థాయి ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఇప్పుడు ఎవరికీ రాకూడని పాన్ ఇండియా కష్టం మాత్రం వచ్చింది.
అంత పెద్ద కష్టమేంటి.. ఇప్పటికే రిలీజ్ డేట్ విషయంలో వరుస ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకొచ్చి ఎట్టకేలకు ఈ నెలాఖరకు రిలీజ్ ముహూర్తం పెట్టుకున్న సినిమా టీమ్‌కు మరో కష్టమా అనుకుంటున్నారా? నిజమే టీమ్ గత కొన్ని నెలలుగా సినిమా టీమ్ రీషూట్‌లు, రిలీజ్ కష్టాలు పడ్డ టీమ్ రీసెంట్‌గా వచ్చిన టైటిల్ కష్టాన్ని దాటింది. తమ సినిమా హిందీ వెర్షన్‌కు కొత్త పేరును తీసుకొచ్చింది. ఈ మేరకు సినిమా టీమ్ కొత్త పోస్టర్‌ను లాంచ్ చేసింది. కొత్త పేరుగా ‘సామ్రాజ్య’ను ఎంచుకుంది.
ఏదైనా సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసినప్పుడు ఒక్కో భాషలో ఒక్కో పేరు పెడితే ఎలా ఉంటుంది చెప్పండి.. అస్సలు బాగోదు కదా. కానీ ఇప్పుడు ‘కింగ్డమ్’ టీమ్ ఈ ఇబ్బందిని ఎదుర్కొంది. తమ పేరును ఇప్పటికే హిందీలో మరొకరు రిజిస్టర్ చేసేయడంతో ‘సామ్రాజ్య’ అనే పేరును కొత్తగా రిజిస్టర్ చేసుకుంది. అంటే సినిమాను రెండు పేర్లతో ప్రమోట్ చేసుకోవాలి.
ఇది వినడానికి సులభంగా ఉన్నా.. ప్రచారంలో ఇబ్బందులు పెట్టేదే. అందుకే ఈ కష్టం ఎవరూ కోరుకోనిది అని చెప్పొచ్చు. ‘కింగ్డమ్’ సినిమాకు ఎదురైన పరిస్థితి ఇతర సినిమాల వాళ్లకు రాకుండా ముందు జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పొచ్చు. పాన్ ఇండియా అని సినిమాను అనౌన్స్ చేయడం కాదు.. ముందుగా అన్నీ రెడీ చేసుకోవాలి మరి.