ఈ మనోభావాలు అనేవి ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ.. అర్జెంట్ గా వాటిని ఏ స్విస్ బ్యాంక్ లో అయినా భద్రపరచి అప్పుడు సినిమాలు తీయాలి అనిపిస్తుంటుంది కొన్ని సినిమాల్లో ఏదైనా బోల్డ్ కంటెంట్, జాతి, మతం, కులానికి సంబంధించిన అభ్యంతకరమైన లేదా ఇబ్బందికరమైన కంటెంట్ ఉంటే సదరు సినిమాలు మనోభావాలు దెబ్బతీసాయి అంటే పర్లేదు కానీ.. టైటిలే మనోభావం దెబ్బతేసేలా ఉంది కాబట్టి సినిమాను రిలీజ్ చేయకూడదు అంటే ఎలా. ఇప్పుడు “నోటా” విషయంలో అలాంటి సమస్యే తలెత్తింది.
తమిళనాట తెలుగు సంఘాల పేరుతో హడావుడి చేస్తూ తిరిగే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మరో రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ విధంగా “నోటా” అనే సినిమా విడుదలకావడం సదరు పదం మనోభావాన్ని దెబ్బతీస్తుంది అనేది ఆయన వెర్షన్. ఈయన్ని పెద్ద సీరియస్ గా ఎవరూ తీసుకోనప్పటికీ.. ఇలా రిలీజ్ సమయంలో పాపులర్ సినిమాల మీద పొలిటీషియన్స్ లేదా పోలిటికల్ గా పబ్లిసిటీ కోసం జనాలు హడావుడి చేయడం అనేది కొత్తేమీ కాకపోయినా.. అసలు ఎందుకు ఈ రచ్చ అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు.