తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ (Vijay Thalapathy) 2026 ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్న విషయం తెలిసింది. తాను స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రజలకు పరిచయం చేస్తూ, ఇటీవలే భారీ బహిరంగ సభను నిర్వహించి అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈ సభలో పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. సామాజిక మార్పు లక్ష్యంగా పెట్టుకుని ప్రజా క్షేత్రంలోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజా సమాచారం ప్రకారం, విజయ్ రాజకీయ ప్రవేశంపై సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సోదరుడు సత్యనారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
Vijay Thalapathy
కొన్ని రోజుల క్రితం రజనీకాంత్ కూడా విజయ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. అధికార పార్టీని విమర్శిస్తూ విజయ్ చేసిన వ్యాఖ్యలు అనవసరమని, రాజకీయాల్లో హుందాగా ఉండాలని సూచించారు. ఒక మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ, “అతన్ని రానివ్వండి, ఒక మంచి లక్ష్యంతోనే వచ్చాడు. గతంలో కమల్ హాసన్ (Kamal Haasan) వంటి వారు కూడా రాజకీయాల రంగంలోకి వచ్చారు. విజయ్ కూడా ప్రయత్నించాలి. కానీ ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. అతడు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
విజయ్ రాజకీయ ఆశయాలతో రంగంలోకి దిగాడు. అయితే, గెలుస్తాడాని మాత్రం అనిపించడం లేదు, నేను నమ్మడం లేదు. ప్రజల మన్నన పొందడం అంత సులభం కాదు. నాయకులు ప్రజలలో తిరగాలి, వారి సమస్యలను తెలుసుకోవాలి. వాటిపై అధికార పార్టీతో పోరాటం చేయాలి” అని వివరించారు. ప్రస్తుతం సత్యనారాయణ యొక్క వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కొన్ని రోజుల క్రితం రజనీకాంత్ కూడా విజయ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
ప్రభుత్వం లో ఉన్న పార్టీని విమర్శిస్తూ విజయ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని, రాజకీయాల్లో హుందాగా ఉండాలని అన్నారు. ఇలా, విజయ్ పార్టీకి సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు లేదు అని ఇప్పటికే స్పష్టమైంది. సత్యనారాయణ కూడా విజయ్ గెలవడం కష్టమని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది, విజయ్ మొదట్లోనే బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఫ్యామిలీ నుంచి ఇలాంటి కామెంట్స్ ఎదురవ్వడం అతనికి పెద్ద చాలెంజ్ లాంటిది. మరి ఈ సవాళ్ళని అతను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.