“డియర్ కామ్రేడ్” చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇలా నాలుగు భాషల్లో సినిమాలను “డియర్ కామ్రేడ్”కు మాత్రమే పరిమితం చేయలేదు.. తన తదుపరి చిత్రాలు కూడా ఇదే విధంగా నాలుగు భాషల్లో ఒకేసారి షూట్ చేసి, రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈమేరకు మైత్రీ మూవీస్ బ్యానర్ లో “హీరో” అనే సినిమా సైన్ చేసిన విజయ్ దేవరకొండ ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో రూపొందనుందని ప్రకటించాడు.
అంతా బాగానే ఉంది కానీ.. కాంట్రవర్సీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా.. విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ “హీరో” సినిమాని నాలుగు భాషల్లో ఎనౌన్స్ చేసిన రోజే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా “హీరో” అనే సినిమా మొదలెట్టారు. దాంతో తమిళంలో విజయ్ దేవరకొండ సినిమాకి “హీరో” అనే టైటిల్ మిస్ అయినట్లే. మరి తమిళం వరకూ వేరే టైటిల్ ఏదైనా పెడతారా లేక వేరే ఏదైనా మార్గం చూసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది