ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించి స్టార్ రైటర్ గా గుర్తింపును సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి దర్శకత్వం వహించిన 2 సినిమాలు మినహా మిగిలిన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఛాన్స్ వస్తే పవన్ కొరకు కథ రాస్తానని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చెబుతూ రాజమౌళి ఇద్దరు హీరోలతో కమర్షియల్ సినిమా చేయాలని అనుకున్నారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ – అల్లు అర్జున్, రజినీకాంత్ – ఎన్టీఆర్, కార్తీ – బన్నీ, కార్తీ – సూర్య కాంబినేషన్ గురించి
ఆలోచిస్తున్న సమయంలో రాజమౌళి అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడిగా మారడానికి ముందు రెండు సంవత్సరాలు ఎక్కడికో వెళ్లారని ఆ రెండేళ్లు ఎక్కడ ఉన్నారనే దాని గురించి సరైన సమాచారం లేదని చెప్పాడని కొమురం భీమ్ కూడా కొంత సమయం ఎక్కడికో వెళ్లి ఆ తర్వాత అందరికీ తెలిసిన భీమ్ గా మారాడని చెప్పాడని చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరూ ఆ సమయంలో తారసపడితే ఎలా ఉంటుందని రాజమౌళి తనతో అన్నారని అలా ఆర్ఆర్ఆర్ కథ ప్రారంభమైందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా అక్టోబర్ నెల 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి దోస్తీ సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.