‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది అనే ప్రశ్నకు చాలా సమాధానాలు వస్తాయి. మరి ఆ తర్వాత చేయబోయే సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది? దీనికి సమాధానం అయితే దొరకడం లేదు. సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసినా ఎందుకో కానీ ఇంకా పట్టాలెక్కించడం లేదు. రామ్‌చరణ్ (Ram Charan) లుక్ ఇంకా సెట్ అవ్వలేదని కొందరు అంటుంటే.. సినిమా కాస్ట్ అండ్ క్రూ రెడీ అవ్వలేదు అని మరికొందరు అంటున్నారు. సినిమా కథ, కథనానికి సంబంధించి బుచ్చిబాబు (Buchi Babu) ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని..
Ram Charan
మిగిలిన అంశాల విషయంలోనే సినిమా ఆలస్యమవుతోంది అని అంటున్నారు. అయితే దసరా తర్వాత సినిమా షూటింగ్‌కి రెడీ అవుతుంది అని అంటున్న ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే సినిమాలో కీలకమైన ఓ విభాగాన్ని చూసేది ఎవరో అనౌన్స్ చేశారు. సినిమా సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌ను మీరు ఫాలో అవుతున్నట్లు అయితే.. ఆ కొత్త అనౌన్స్‌మెంట్ కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్‌ను డీల్ చేసే వ్యక్తి గురించే అని చెప్పేస్తారు.
మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా నేటి సమయాన్ని సూచించేలా ఉండదు అని ఇప్పటికే వార్తలొచ్చాయి. ‘రంగస్థలం’ (Rangasthalam) తరహాలోనే 80 -90ల కాలంలో సినిమా అంటున్నారు. దీంతో అప్పటి కాస్ట్యూమ్స్ సిద్ధం చేయడానికి ‘తంగలాన్’ (Thangalaan) ఏగన్ ఏకాంబరాన్ని ఎంపిక చేశారట. ‘తంగలాన్’ సినిమాలో ఏకాంబరం రూపొందించిన కాస్ట్యూమ్స్‌కు మంచి స్పందన వచ్చింది. సన్నివేశాన్ని, కాలాన్ని ఎలివేట్ చేసేలా వాటిని తీర్చిదిద్దారు.
చరణ్ కుస్తీ వీరుడిగా కనిపించనున్న ఈ సినిమాలో ఏకాంబరం భాగం అయ్యారని సినిమా టీమ్ అనౌన్స్ చేసింది. దీంతో ఇప్పుడు కాస్ట్యూమర్‌ను తీసుకున్నారు అంటే ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలానే పెండింగ్ ఉంది అని అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన సినిమా ప్రారంభానికి కొన్ని నెలల పట్టొచ్చు అనే వాదన వినిపిస్తోంది. మరి బుచ్చిబాబు ఏం చేస్తారో చూడాలి.