ఒక హిట్టు సినిమాకి సరైన పారితోషికం లభించలేదనో, ఆశించిన స్థాయి క్రెడిట్స్ ఇవ్వలేదనో సినిమాకి పని చేసినవాళ్లు రకరకాలుగా కొట్టుకోవడం చూసే ఉంటాం. కానీ.. మొట్టమొదటిసారిగా ఒక డిజాస్టర్ సినిమా విషయంలో ఒక నిర్మాత, దర్శకుడు ట్విట్టర్ సాక్షిగా కొట్టుకొంటున్నారు. అది కూడా సినిమా కథ/పాయింట్ నాదంటే నాది అని. వాళ్ళే దర్శకుడు దేవా కట్ట, నిర్మాత విష్ణు ఇందూరి. ఈ ఇద్దరు అప్పుడెప్పుడో 2015లో ఒక మీటింగ్ లో ఎన్టీఆర్ బయోపిక్ గురించి డిస్కస్ చేసుకున్నారట.
మరి ఆ మీటింగ్ వల్ల ఒరిగింది ఏమిటి అనేది తెలియదు కానీ.. నిన్న సాయంత్రం నుంచి ఈ ఇద్దరు మెయిన్ ప్లాట్ నేను చెప్పాను అంటే నేను చెప్పాను అంటూ ట్విట్టర్ లో ఒకటే గోల. ఈ ట్వీట్లు చూస్తున్నవాళ్ళందరూ.. కనీసం హిట్టయిన సినిమా గురించి కొట్టుకున్నా బాగుండు కానీ.. ఇలా ఫ్లాప్ సినిమా విషయంలో గోల చేయడం ఎవరికి ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు. నిజమే సినిమా పాయింట్ ఎవరు చెప్పారు అనేది పక్కనపెడితే.. అది ప్రస్తుతానికి అప్రస్తుతం.
కనీసం సినిమా హిట్ అయ్యుంటే.. నా క్రెడిట్స్ కొట్టేశారు అని దేవా కట్ట కాస్త గొడవ చేసినా కాస్త మీనింగ్ ఫుల్ గా ఉండేది. ఇప్పుడు ఇలా వీళ్ళు ఇలా గొడవపడటం అనేది మాత్రం ఒకరి పరువు మరొకరు సోషల్ మీడియా సాక్షిగా తీసుకోవడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడదు.
I would like to clear it once and for all. I met Deva katta for a Remake I selected in December 2015, I also narrated the idea of NTR Biopic to him with basic screenplay. He liked My idea of NTR and I would like to clear that he never narrated any thing to me about NTR Biopic. https://t.co/R8rlxuRJDm