‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) .. ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కలయికలో రూపొందిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యాయి. వాటిలో విజువల్స్ అదిరిపోయాయి. అయితే ‘కల్కి..’ కథ ఏంటి? ఏ అంశం చుట్టూ.. కథనం ఉంటుంది? వంటి అనేక ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి. ముఖ్యంగా శంభల అనే అంశం కూడా హైలెట్ అయ్యింది. అసలు శంభల ఏంటి? దాని కథ ఏంటి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
శంభల ఓ దేవ రహస్యం అని అంటుంటారు. సంస్కృతం నుండి తీసుకున్న పదం శంభల. తెలుగులో దీనికి శాంతి స్థానమనే అర్థం వస్తుంది. హిమాలయాల్లో ఎవ్వరికీ తెలియని మరో ప్రపంచమే ఈ శంభల అని.. మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉందని అంటుంటారు. పురాణాల్లో కూడా అలానే ఉంది. ఆ ప్రదేశంలో ఎంతోమంది ఋషులు తపస్సు చేస్తుంటారట. రామాయణ, మహాభారతం వంటి వాటిలో కూడా ఈ శంభల ప్రస్తావన ఉండటాన్ని మనం గమనించవచ్చు.
కల్కి కూడా ఇక్కడి నుండే వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఇదే లైన్ తో ‘కల్కి 2898 ad ‘ కథ అల్లుకున్నాడని అంటున్నారు. అయితే ‘బి అండ్ బి'(బుజ్జి అండ్ భైరవ) లో భైరవ పాత్ర కాశీలో ఉన్నట్టు చూపించారు. అప్పుడు ‘ప్రభాస్ ‘కల్కి..’ కాదా?’ అనే డౌట్లు అందరిలో ఏర్పడ్డాయి. మరి దీని మిస్టరీ వీడాలంటే జూన్ 27న ‘కల్కి..’ రిలీజ్ అయ్యే వరకు ఆగాలి.