‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఏంటి? అని అడగ్గానే త్రివిక్రమ్ సినిమా అని ఠక్కున చెప్పేస్తారు అభిమానులు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ప్రకటించారు. మొన్నీ మధ్య కూడా సినిమా మొదలెట్టేస్తాం అంటూ లీకులు కూడా ఇచ్చారు నిర్మాతలు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అభిమానుల సమాధానం మారేలా కనిపిస్తోంది. అవును ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్లుగా ఉంది. ఏమైంది, ఏం చేస్తారు లాంటి ప్రశ్నలకు సమాధానాలు అయితే ఇప్పట్లో చెప్పడం కష్టం.
త్రివిక్రమ్ సినిమా అనుకున్నప్పటి నుండి ఏదో విధంగా అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. కరోనా కారణంగా సినిమా ఆలోచన సుమారు ఏడాది ఆగిపోయింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక మొన్నీమధ్యనే లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పుడు సినిమా ఆలోచనపై వెనక్కి మళ్లారు అని తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే ఈ సినిమా ఇప్పట్లో మెటీరియలైజ్ కాదు అంటున్నారు. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అన్నట్లు త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా నటిస్తాడని వార్తలొచ్చాయి.
మరి ఈ సినిమా ఆగింది/వాయిదా పడింది అంటే.. ఆ వెనుక ఉన్నది ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబునే. ఇటీవల ఎన్టీఆర్‌ను కలసి బుచ్చిబాబు ఓ సినిమా కథ చెప్పాడని వార్తలొచ్చాయి. అందులో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని.. ఒకటి 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని వార్తలొచ్చాయి. ఛాలెంజింగ్‌గా ఉంటూ, కొత్తగా ఉండటంతో సినిమాకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడని కూడా అన్నారు. సో త్రివిక్రమ్ సైడ్ అయితే, బుచ్చిబాబు ఎంటర్ అవుతాడు. చూద్దాం ఏమన్నా అనౌన్స్‌మెంట్ ఉంటుందేమో.