వచ్చే ఆరు నెలలు టాలీవుడ్‌ ఎలా ఉంటుందో తెలుసా?

2022 సగం పూర్తయిపోతోంది. ఇంకో రెండు రోజులు ఆగితే.. ఈ ఏడాదిలో సెకండాఫ్‌ మొదలవుతుంది. మనం సినిమా వాళ్లం కాబట్టి.. ఈ సెకండాఫ్‌లో వచ్చే కొత్త సినిమాలేంటి, వాటి సంగతేంటో చూద్దాం. ఇప్పటివరకు టాలీవుడ్‌కి ఈ ఏడాది మంచే చేసింది. పెద్ద పెద్ద సినిమాలు వచ్చి మంచి విజయాల్ని అందుకున్నాయి. మరి ద్వితీయార్ధంలో ఏయే సినిమాలొస్తాయి, వాటి పరిస్థితి ఏంటో చూద్దాం.

* జులైలో పేరున్న సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. 1వ తేదీన గోపీచంద్‌ – మారుతి ‘పక్కా కమర్షియల్‌’ వస్తుంది. 14న రామ్‌ – లింగుస్వామి ‘వారియర్‌’ తీసుకొస్తున్నారు. నాగచైతన్య – విక్రమ్‌ కె కుమార్‌ ‘థ్యాంక్‌ యూ’, నిఖిల్‌ – చందు మొండేటి ‘కార్తికేయ 2’ 22న వస్తాయి. 29న రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, అడివి శేష్‌ ‘హిట్‌ 2’ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

* ఆగస్టు సంగతి వచ్చేసరికి రెండో వారం మంచి బిజీగా మారబోతోంది. లాంగ్‌ వీకెండ్‌ కావడంతో కుర్ర హీరోల సినిమాలు వరుసకడుతున్నాయి. అఖిల్‌ – సురేందర్‌ రెడ్డి ‘ఏజెంట్‌’, నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు ఆగస్టు 12న తీసుకొస్తున్నారు. సమంత ‘యశోద’ కూడా అప్పుడే వస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌ – హను రాఘవపూడి ‘సీతా రామం’ ఆగస్టు 5న తీసుకొస్తున్నారు. పూరి జగన్‌ – విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ను ఆగస్టు 25న తీసుకొస్తారు.

* సెప్టెంబరులో రిలీజ్‌ అయ్యే సినిమాలు అంటే ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన సినిమా అంటే రవితేజ ‘రావణాసుర’ ఒక్కటే. ఆగస్టులో విడుదల చేస్తారని గతంలో వార్తలొచ్చిన ‘బింబిసార’ను సెప్టెంబరులో తీసుకొస్తారని అంటున్నారు. ఇంకా నెలల ప్రకారం చూసుకుంటే విజయ్‌ దేవరకొండ – సమంత – శివ నిర్వాణ సినిమా ‘ఖుషి’ డిసెంబరు 23న తీసుకొస్తారు.

* ఇక డేట్స్‌ అధికారికంగా చెప్పని సినిమాలు చాలానే ఉన్నాయి. హీరోల వారీగా చూస్తే చిరంజీవి ‘లూసిఫర్‌’ దసరా కానుకగా తీసుకొస్తారని చెబుతున్నారు. ఇక బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాను కూడా అదే సమయానికి అంటున్నారు. ఈ సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ రావాల్సి ఉంది. వెంకటేశ్‌ నుండి ఇంకా ఏ సినిమా రెడీగా లేదు. నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా షూట్‌ అయ్యింది. ఆ తర్వాత ఎలాంటి ముచ్చట్లూ లేవు. కాబట్టి చెప్పలేం.

* పవన్‌ కల్యాణ్‌ నుండి ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎప్పుడు అవుతుందో చెప్పలేం. అయితే ఈ ఏడాది ఆఖరులో వచ్చేయొచ్చు. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, తారక్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌.. నుండి ఈ ఏడాది సినిమాలు ఆశించలేం. ఇంకా ఎవరి సినిమా కూడా విడుదలకు సిద్ధంగా లేవు. నాని నుండి అయితే ‘దసరా’ రిలీజ్‌ అవుతుంది అంటున్నారు. సమంత – గుణశేఖర్‌ల ‘శాకుంతలం’ సినిమా ఇంకా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. విడుదల తేదీ మీద ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.