‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి మరీ ప్రమోషన్స్ చేస్తోంది సినిమా టీమ్. సంక్రాంతికి విడుదలైన, అవుతున్న సినిమాల్లో ఈ స్థాయిలో ప్రచారం చేసిన / చేస్తున్న సినిమా ఇంకొకటి లేదు అనే చెప్పాలి. ఆ విషయం పక్కనపెడితే ఇలా ప్రచారం కోసం రానా టాక్ షోకి వచ్చిన అనిల్ రావిపూడి మాటల్లో ఓసారి నోరు జారారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరు లాంటి వివరాలు అయితే చెప్పలేదు. అయితేనేం వైరల్ అవ్వడానికి కావాల్సినంత స్టఫ్ అయితే ఇచ్చేశారు.
Anil Ravipudi
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విడుదల నేపథ్యంలో రానా దగ్గుబాటి షోకి వచ్చినప్పుడు ‘ఇద్దరు హీరోయిన్లు’ అనే టాపిక్ వచ్చింది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అనిల్ రావిపూడి గతంలో ఇద్దరు నాయికల విషయంలో పడ్డ ఇబ్బందుల్ని ప్రస్తావించారు. ‘ఇద్దరు హీరోయిన్లు ఓ సినిమాలో ఉంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో తనకు తెలుసని, గతంలో ఓసారి అనుభవం అయింది’ అని చెప్పుకొచ్చారు. ఈ హీరోయిన్లతో ఆ ఇబ్బంది లేదు అని చెప్పుకొచ్చారు.
ఆయన అక్కడ సాఫ్ట్‌గా ఇష్యూను క్లోజ్ చేసేసినా అసలు ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనే చర్చ మొదలైంది. అనిల్ ఫిల్మోగ్రఫీ చూస్తే.. ‘పఠాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘సరిలేరు నీకెవ్వరు’ ఒక హీరోయిన్ ఉన్న సినిమాలే. ఇక ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, ‘భగవంత్ కేసరి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఆఖరి సినిమా హీరోయిన్లు పక్కనే ఉన్నప్పుడు మాట్లాడారు కాబట్టి ఆ సినిమా కాదు.
ఇక మిగిలినవి మూడు సినిమాలు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, ‘భగవంత్ కేసరి’. ఆఖరి సినిమాలో కాజల్, శ్రీలీల నటించారు. అయితే ఇద్దరి మధ్య సీన్సూ తక్కువ. ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కాదు. కాబట్టి మిగిలి ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’. ఈ సినిమాల్లో తమన్నా, మెహ్రీన్ నాయికలు. మరి అనిల్ రావిపూడి ఎవరి గురించి మాట్లాడారో?