సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఓ వయసంటూ ఏమీ ఉండదు. ఎవరు ఎప్పుడు రావాలి అనేది వారి ఇష్టం. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోగా ఉండాలి అంటే కాస్త ఎర్లీగానే రావాలి. అయితే ఈ విషయం బాలకృష్ణకు (Nandamuri Balakrishna) తెలియకుండా ఉంటుందా అంటే కచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి తన వారసుడి విషయంలో ఎందుకు ఇంకా ఓ నిర్ణయం తీసుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా ఇదే విషయంలో వాదన నడుస్తోంది.
Mokshagnya
ఇండస్ట్రీలో మిగిలిన హీరోల సంగతి పక్కన పెడితే.. ముందు వారసుల విషయంలో తొలి సినిమాకు వాళ్ల ఏజ్ ఎంతో చూద్దాం. వారసులు వివరాలు చూడాలని అనుకున్నప్పుడు తొలుత బాలకృష్ణతోనే మొదలుపెడదాం. 24 ఏళ్ల వయసులోనే హీరోగా తన తొలి సినిమాను చేశారు. వెంకటేశ్ (Venkatesh Daggubati) 26 ఏళ్ల వయసులో సినిమాల్లోకి రాగా, 27 ఏళ్ల వయసులో నాగార్జున (Nagarjuna) వచ్చారు. ఇక ఆ తర్వాతి తరం చూస్తే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 25 ఏళ్ల వయసులో హీరోగా వచ్చాడు.
ఇక రామ్‌చరణ్ (Ram Charan) 22 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాడు. అల్లు అర్జున్ (Allu Arjun) అయితే 21 ఏళ్ల వయసులోనే వచ్చాడు. తారక్ (Jr NTR) 19 ఏళ్ల వయసులో వచ్చాడు. మహేష్‌బాబు (Mahesh Babu) 25 ఏళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇలా చూసుకుంటే అందరూ 30 ఏళ్ల వయసులోపే వచ్చేశారు. కానీ మోక్షజ్ఞకు (Nandamuri Mokshagnya) ఇప్పుడు 30 ఏళ్లు వచ్చేశాయి. ఇంతవరకు సినిమా ఎంట్రీ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ఆ మధ్య అనౌన్స్ చేశారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈపాటికి షూటింగ్ మొదలైపోవాలి. కాన ఇప్పటివరకు కావడం లేదు. బాలకృష్ణను ఈ విషయం అడిగితే ‘అతి త్వరలో’ అని చెప్పి వదిలేశారు. ఈ క్రమంలో ఆయ ముఖంలో వెలుగు లేదు. ఇదంతా చూస్తుంటే మోక్షజ్ఞ ఎంట్రీ చాలా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అదే జరిగితే వారసుల ఎంట్రీ విషయంలో మోక్షజ్ఞ ఎంట్రీనే లేట్ అవుతుంది. మరి లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాడా లేదా అనేది చూడాలి.