లక్షల లైక్‌లు, కోట్ల వ్యూస్ అంటూ.. నిన్న సాయంత్రం 4.05 నుండి సోషల్ మీడియా ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించే ఇదంతా అని మీకు అర్థమైపోయుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ల స్టయిల్‌లో ట్రైలర్ లేట్‌గా నే వచ్చింది. ఈ విషయంలో ఎవరూ షాక్ అవ్వలేదు. అయితే ప్రేక్షకులు మాత్రం ట్రైలర్ చూసి ఓ విషయంలో షాక్ అయ్యారు అని చెప్పొచ్చు. అవే డైలాగ్స్.
సినిమా ట్రైలర్‌లో సుమారు 10 డైలాగ్‌లు ఉన్నాయి. అందులో ఎనిమిది వరకు ఓకే. కానీ ఓ రెండు డైలాగ్‌ల విషయంలో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నిజానికి అవేమన్నా బూతులా అంటే కాదు. కేవలం డబుల్ మీనింగ్ డైలాగ్‌లు మరి. అయితే మహేష్‌బాబు లాంటి స్టార్ హీరో నోట అలాంటి డైలాగ్‌లు వచ్చేసరికి ‘హవ్వ’ అనుకుంటున్న వాళ్లూ ఉన్నారు. ఇదేంటి ఫ్యాన్స్‌ని హర్ట్ చేసేలా అంటున్నారు మీరు అనుకోవచ్చు.
కానీ ఆ డైలాగ్స్‌ను మరోసారి వింటే అవసరమా అనిపించేలా ఉన్నాయి. అయితే మాస్ ప్రేక్షకుల కోసం మహేష్ నోట ఆ డైలాగ్స్ పలికించారు అనుకోవచ్చు. అయితే మహేష్ ఇప్పటికే చాలా మాస్ సినిమాలు చేశారు. ఎప్పుడూ ఈ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు రాలేదు. ‘ఖలేజా’లో ఎక్కువ మాసీగా డైలాగ్‌లు చెప్పినా అందులో వెటకరామే కనిపిస్తుంది తప్ప. ఆ సెమీ బూతు కనిపించదు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’లో పక్కాగా కనిపిస్తుంది.
ఏమన్నా అంటే సినిమా బృందమందతా ‘పోకిరి’ + ‘గీత గోవిందం’ = ‘సర్కారు వారి పాట’ అంటున్నాయి. అయితే ‘పోకిరి’లో డబుల్ మీనింగ్‌లు లేవు, ‘గీత గోవిందం’లోనూ లేవు. మరి ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి. మాస్ మెంటల్ స్వాగ్‌ను కోరుకునే వారి కోసం ఇలాంటివి రాసి ఉండాలి. మాస్ అంటే డబుల్ మీనింగ్ అని అనుకుంటే సరికాదు అని చెప్పొచ్చు. పరశురామ్ ఆలోచనలు ఏంటో చూడాలి. అంతా ఓకే డబుల్ మీనింగ్ అంటున్నారు ఆ డైలాగ్‌లేంటి అని అడుగుదాం అనుకుంటున్నారా.
డబుల్ మీనింగ్ అన్నాక ఇక్కడ రాసి మళ్లీ ఇబ్బందిపడటం ఎందుకని.. రాయలేదు. ట్రైలర్ చూసే ఉంటారు కాబట్టి మీకు అవేంటో తెలిసే ఉంటాయి. మరి ఇవి సినిమాలో ఉంటాయా అంటే చూడాలి మరి.