కొన్ని రోజుల క్రిత్రం మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తారని వార్తలు వచ్చాయి. మీరు కూడా వినే ఉంటారు, లేదంటే చదివే ఉంటారు. ఆ సమయంలో చాలామంది చెప్పిన మాట ఏంటి అంటే.. రాజ్యసభలో సీట్లు ఏవీ ఖాళీగా లేవు. అందులో తెలుగు రాష్ట్రాల నుండి అతి త్వరలో ఖాళీ అయ్యే సీట్లు లేనేలేవు అని అన్నారు. ఇప్పుడు ఓ చోటు ఖాళీ అయింది. దీంతో మరోసారి రాజ్యసభకు చిరంజీవి అనే పుకారు మళ్లీ బయటకొచ్చింది.
Chiranjeevi
వైఎస్‌ఆర్‌సీపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు మాజీ అయ్యారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్నా అని ప్రకటించి.. రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుండి ఓ రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. ఆ స్థానం కోసం త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ స్థానం చిరంజీవి కోసమే ఖాళీ చేశారు అనే చర్చ మొదలైంది. మరి నిజంగానే చిరు అటు వెళ్తారా?
మళ్లీ ఇదేం టౌట్ అనుకుంటున్నారా? చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలు ఓకే చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా పనులు చూసుకుంటున్న ఆయన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) సినిమాను ఇటీవల ఓకే చేశారు. మరోవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా త్వరలో అనౌన్స్‌మెంట్ అని చెబుతున్నారు. మరి ఎంపీ అయ్యాక సినిమాల్లో నటిస్తారా? అనేదే ప్రశ్న. గతంలో ఆయన అలా నటించలేదు కాబట్టే ఆ డౌట్.
ఒకవేళ ఆయన నటిస్తే రెండు పడవల ప్రయాణం చేస్తున్నట్లే. అంతేకాదు మెగా కుటుంబం నుండి ఒకేసారి ముగ్గురు అన్నద్దమ్ములు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నట్లు అవుతుంది. ఇటు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నాగాబాబు (Naga Babu) త్వరలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇటీవల చంద్రబాబే చెప్పారు. ఎమ్మెల్సీ ప్లేస్ ఖాళీ అయ్యాక ఆయన మంత్రి పదవి తీసుకుంటారట. ఇప్పుడు చిరంజీవి ఎంపీ అయితే కొణిదెల కుర్రాళ్లకు, వాళ్ల ఫ్యాన్స్‌కి ఆనందమే ఆనందం.