దివంగత స్టార్ హీరో నందమూరి తారక రామారావు గారి నాలుగవ కూతురు కంటమనేని ఉమా మహేశ్వరి నిన్న హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచింది. ఎన్టీఆర్- బసవతారకం దంపతులకు ఆమె నాలుగో కుమార్తె అన్న సంగతి తెలిసిందే.మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె డిప్రెషన్ కు గురవ్వడంతో తన గదిలో ఉన్న ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది ఉమా మహేశ్వరి.
ఈ విషయాన్ని ఆమె కూతురు దీక్షిత స్పష్టం చేసింది. అనంతరం ఉమా మహేశ్వరి బాడీని ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. ఆమె కోరిక మేరకు తన రెండు నేత్రాలను కూడా దానం చేశారు కుటుంబ సభ్యులు. అనంతరం ఉమామహేశ్వరి పార్థీవ దేహాన్ని జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేర్చడం జరిగింది. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికా నుండి వచ్చిన తర్వాత అంటే బుధవారం నాడు అంత్యక్రియలు మొదలుపెడతారు.
ఇదిలా ఉండగా.. ఆమె మరణవార్తని తెలుసుకున్న చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, లోకేష్, బాలక్రిష్ణ వంటి వారు వెంటనే ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఇంకా హాజరు కాలేదు అనే డిస్కషన్లు మొదలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం.’బింబిసార’ ప్రీ రిలీజ్ తర్వాత తన భార్య, పిల్లలతో కలిసి వెకేషన్‌కు వెళ్ళాడు ఎన్టీఆర్.కచ్చితంగా ఈ పాటికి ఉమా మహేశ్వరి మరణవార్త తెలిసే ఉంటుంది.
మరి బుధవారం జరగనున్న తన మేనత్త అంత్యక్రియల కి జూ.ఎన్టీఆర్ హాజరవుతాడా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి బుర్రలో మెదులుతున్నాయి. ఒకవేళ అతను హాజరు కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యే ప్రమాదం మాత్రం లేకపోలేదు. అసలే నందమూరి ఫ్యామిలీలో ఒకరంటే ఒకరికి పడినట్టు వ్యవహరిస్తూ ఉంటారని చాలా మంది అంటుంటారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువే. మరి ఏం జరుగుతుందో చూడాలి.