కోలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న తప్పు ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలు గత కొన్నేళ్లలో కథల విషయంలో, పాత్రల ఎంపిక విషయంలో చాలా మారారు. పాన్ ఇండియా కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే దిశగా స్టార్ హీరోలు అడుగులు వేస్తున్నారు. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినట్టేనని చెప్పవచ్చు. టాలీవుడ్ స్టార్ హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలతో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకోనున్నారు.

అయితే కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ స్టార్ హీరోలను చూసి మారాలని కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూనే పాన్ ఇండియా సినిమాలతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరోలు నటించిన సినిమాలు అక్కడి ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ నటించి ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజైన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

విజయ్ నటించిన బీస్ట్, అజిత్ నటించిన వలిమై సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. స్టార్ హీరో ధనుష్ సినిమాలు సైతం వరుసగా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తున్నాయనే సంగతి తెలిసిందే. కథల విషయంలో కోలీవుడ్ స్టార్ హీరోలు మారాలని భారీ బడ్జెట్ సినిమాలకు ప్రమోషన్లను భారీస్థాయిలో చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమిళ హీరోలు ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కెరీర్ పై ఆ ఎఫెక్ట్ పడుతుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

టాలీవుడ్ స్టార్ హీరోలు నార్త్ ఇండియాలోని చిన్నచిన్న నగరాలకు వెళ్లి తమ సినిమాల కోసం ప్రమోషన్లు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలను ఫాలో అయితే మంచిదని చెప్పవచ్చు. మరి తమిళ తంబీలు ఈ విషయంలో మారతారో లేదో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Share.