టాలీవుడ్‌లో స్టార్ హీరోను స్టైలిష్‌గా, యాక్షన్ మోడ్‌లో చూపించాలి అంటే గుర్తొచ్చే దర్శకుల్లో పేర్లలో మెహర్ రమేశ్ పేరొకటి. ‘బిల్లా’, ‘కంత్రి’ లాంటి సినిమాల్లో హీరోను ఆయన ప్రొజెక్ట్ చేసిన విధానం అద్భుతం అని చెప్పొచ్చు. అయితే అదంతా గతం.. వరుస ఫ్లాప్‌ల తర్వాత మెహర్ రమేశ్ బాగా వెనుకబడ్డారు. కొన్నేళ్లపాటు సినిమలు లేకుండా ఉన్నారు. ఇక సినిమాల్లోకి రావడం కష్టమే అనుకుంటున్నప్పడు.. హఠాత్తుగా ‘భోళా శంకర్’ అంటూ ఓ సినిమా అనౌన్స్ చేశారు.
ఏదో ఓ సినిమా అని అనుకుంటూ మొదలవ్వగా.. ఇప్పుడు ఆ సినిమా విజయం చిరంజీవి కి బాగా అవసరం అనే పరిస్థితి వచ్చింది. ‘సైరా’, ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’ లాంటి సినిమాల సమయంలో ‘భోళా శంకర్’ మొదలవ్వడంతో సోసో హిట్ కొట్టినా చిరంజీవికి ఇప్పుడు ఓకే అనుకున్నారు. ఆ బరువును మెహర్ రమేశ్ మోయగలరు అని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే ‘వాల్తేరు వీరయ్య’ విజయంతో చిరంజీవి మీద అంచనాలు, లెక్కలు మళ్లీ పీక్స్‌కు వెళ్లిపోయాయి.
తర్వాత వచ్చే సినిమా కూడా ‘వాల్తేరు వీరయ్య’ లాంటి ఘన విజయం సాధించే సినిమా అవ్వాలి అని లెక్కలేస్తున్నారు. ఈ సమయంలో ఆ భారం మెహర్ రమేశ్‌కు బలంగా పడుతోంది అంటున్నారు. ఏదో హిట్ చాలు అనుకోవడం వేరు.. బ్లాక్‌బస్టర్ కావాలి అనుకోవడం వేరు. ఇప్పుడు చిరంజీవికి నెక్స్ట్ మూవీ బ్లాక్‌బస్టర్ కావాఇ. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విజయం ఏదో ఫ్లూక్‌లో వచ్చింది కాదని.. అది చిరంజీవికి దక్కాల్సిన విజయం అని అందరూ అనుకోవాలి అంటే ‘భోళా శంకర్’ కూడా ఘన విజయం అందుకోక తప్పదు.
దీంతో సరైన విజయం లేకుండా డల్‌గా మారిన మెహర్ రమేశ్ ఇప్పుడు ‘భోళా శంకర్’ను ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే చిరంజీవి ఆలోచనలతో సినిమాను ఆయన ముందకు నడిపిస్తున్నారు అనేది కాస్త ఊరటనిచ్చే విషయమే.