మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మరో 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందనే సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గాయి. అయితే క్రేజ్ తగ్గిన తర్వాత టికెట్ రేట్లను తగ్గించడం ఈ సినిమాకు ప్లస్ అవుతుందా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా మరికొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది.
సమ్మర్ హాలిడేస్ ను సర్కారు వారి పాట సినిమా పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోలేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భారీగా టికెట్ రేట్లను పెంచడం వల్ల పెద్ద సినిమాలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే పెద్ద సినిమాలకు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ రేట్లను పెంచడం వల్ల భవిష్యత్తులో పెద్ద సినిమాలకు ఇబ్బందులు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
టికెట్ రేట్లు పెంచడం వల్ల పెద్ద సినిమాలకు రిపీట్ ఆడియన్స్ కూడా ఉండటం లేదు. టాలీవుడ్ నిర్మాతలు థియేట్రికల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ నిర్మాతల అత్యాశ వల్ల ఓటీటీలపై ఆసక్తి చూపుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు థియేటర్లకు దూరమవుతున్న ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తెలుగు రాష్ట్రాలలో సర్కారు వారి పాట మేకర్స్ టికెట్ రేట్ రేట్లను తగ్గించినా ఈ సినిమాకు ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఎఫ్3 సినిమా టాక్ ను బట్టి సర్కారు వారి పాట సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ కావాలని మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ తర్వాత సినిమాలు త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.