Sai Dharam Tej: సాయితేజ్ కి ఈ హీరోయిన్ కలిసొస్తుందా..?

యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ కి యూత్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. చాలా మందికి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో ‘భీమ్లానాయక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సంయుక్త. ఈ సినిమాలో రానా సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. గ్లామరస్ గా కనిపించడంతో పాటు అద్భుతంగా నటిస్తుండడంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

గతేడాది ‘బింబిసార’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సంయుక్త మీనన్. హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. టైం ట్రావెల్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తో ఆడిపాడింది సంయుక్త. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తరువాత సంయుక్త మీనన్ కి వరుస విజయాలు లభిస్తున్నాయి. దీంతో ఆమె క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో కూడా సంయుక్త చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘సార్’ అనే సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇండస్ట్రీలో అందరూ ఆమెని లక్కీ హీరోయిన్ అని అంటున్నారు. ఆమె నెక్స్ట్ సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. కార్తిక్ వర్మ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అతడు సుకుమార్ శిష్యుడు. ఈ సినిమాకి సుకుమారే కథ, కథనం అందించారు. సాయితేజ్ కి యాక్సిడెంట్ జరగకముందు ఈ సినిమా మొదలైంది. యాక్సిడెంట్ కారణంగా సినిమాకి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు. వరుసగా హిట్స్ కొడుతున్న సంయుక్త ఈసారి మెగాహీరోకి కూడా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus