మాస్ క దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నుండి 2024 లో ‘గామి’ (Gaami) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari) వంటి చిత్రాల తర్వాత వచ్చిన సినిమా ‘మెకానిక్ రాకీ'(Mechanic Rocky). నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath)..లు హీరోయిన్లుగా నటించారు. రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మెకానిక్ రాకీ’ చిత్రానికి తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది.
Mechanic Rocky Collections:
సెకండ్ హాఫ్ లో ట్విస్ట్..లు బాగున్నాయని సినిమా చూసిన వాళ్ళు చెప్పుకొచ్చారు. రివ్యూస్ కూడా డీసెంట్ గానే వచ్చాయి. కానీ డ్రై సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. వీక్ డేస్ లో ఈ సినిమా పెర్ఫార్మన్స్ డౌన్ అయ్యింది. ఒకసారి (Mechanic Rocky) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘మెకానిక్ రాకీ’ చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.3.92 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.6.08 కోట్ల దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలిపోయింది.