వచ్చేవారం ఆగస్ట్ 30న సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈవారం గ్యాప్ లో 10 తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. రేపు (ఆగస్ట్ 23) “కౌసల్య కృష్ణమూర్తి, బోయ్, ఉండిపోరాదే, ఏదైనా జరగచ్చు, నివాసి, పండుగాడి ఫోటో స్టూడియో, అశ్వమేధం, నేనే కేడీ నెం.1, జిందా గ్యాంగ్, హవా, నీతోనే హాయ్ హాయ్” అనే పది తెలుగు సినిమాలు రేపు విడుదలవుతున్నాయి. ఈ పది సినిమాల్లో “కౌసల్య కృష్ణ మూర్తి” మినహా మరో సినిమా గురించి సగటు ప్రేక్షకుడికి తెలిసే అవకాశం కూడా లేదు. ఈ పది సినిమాలు “సాహో” విడుదల అనంతరం థియేటర్ల నుండి లేచిపోతాయి.
అలాంటప్పుడు ఇంత కంగారుగా ఒకేరోజు 10 సినిమాలు విడుదల చేసే సదరు చిత్రాల దర్శకనిర్మాతలు ఏం సాదిద్దాం అనుకొంటున్నారు అనేది ఎవరికీ అర్ధం కాని విషయం. అలాగే.. ఈ పది సినిమాలకు మంచి థియేటర్లు కూడా దొరకవు. ఇలా పోటీ పడి ఒకేరోజు ఇన్ని సినిమాలు విడుదల చేసే బదులు.. మీడియం రేంజ్ సినిమాలు రెండు విడుదలైనప్పుడు ఇలాంటి చిన్న సినిమాలు వారానికి రెండు చొప్పున విడుదల చేసినా కనీసం ప్రేక్షకులు చూడ్డానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రేక్షకులందరూ వచ్చేవారం విడుదలవుతున్న సాహో మీద దృష్టి సారించారు. మరి ఈ హడావుడిలో ఈ పది సినిమాలను కేనీసం పది మందైనా చూస్తారో లేదో.