ఒకప్పటి సినిమాల్లో హీరో ఏ ప్రాంతం వాడైనా సరే ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతున్నట్టు చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నటనలో సహజత్వం చూపించాలి. సినిమా కథతో సంబంధం లేకుండా ఏదో ఒక కొత్తదనం ఉండాలి. అలాంటి సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తమ డబ్బులతో టికెట్ కొంటున్నారు. లేకుంటే ఇక ఓటీటీలోనే చూసుకోవచ్చు అంటూ లైట్ తీసుకుంటున్నారు. అందుకే హీరోలు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తమ పాత్ర కోసం కష్టపడుతున్నారు.
ఆ పాత్ర ఏ ప్రాంతానికి చెందింది.. అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని (Heroes) ప్రాంతానికి తగ్గ యాసలో మాట్లాడటానికి క్లాసులు కూడా పెట్టించుకుంటున్నారు. ‘లవ్ స్టోరీ’ కోసం నాగ చైతన్య, ‘దసరా’ కోసం నాని తమ సినిమాల్లో తెలంగాణ యాసలో పర్ఫెక్ట్ గా మాట్లాడటానికి క్లాసులు కూడా తీసుకున్నారు. ఈ సినిమాల్లో ఆ పాత్రలు అంత బాగా రావడానికి వాళ్ళు పెట్టిన శ్రద్ధ అనే చెప్పాలి. అలాగే చాలా మంది హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను అలరించారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) చిరంజీవి :
‘రుద్రనేత్ర’ అనే సినిమాలో ఓ పాత్ర కోసం చిరంజీవి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడారు. అలాగే ‘ముఠామేస్త్రి’ సినిమాలో కూడా అక్కడక్కడ తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనిపిస్తారు.
2) వెంకటేష్ :
‘పోకిరి రాజా’ ఈ సినిమాలో వెంకటేష్ డబుల్ రోల్ చేశారు. అందులో ఓ పాత్ర కోసం ఆయన తెలంగాణ యాసలో మాట్లాడి అలరించారు.
3) నాగార్జున :
‘కింగ్’ సినిమాలో బొట్టు శీను పాత్రలో తెలంగాణ యాసలో మాట్లాడి నాగ్ మెప్పించారు.
4) పవన్ కళ్యాణ్ :
‘జల్సా’ , ‘ఖుషి’ ‘భీమ్లా నాయక్’ సినిమాల్లో పవన్ కళ్యాణ్ అక్కడక్కడా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అలరించారు.
5) మహేష్ బాబు :
‘దూకుడు’ సినిమాలో ఎం.ఎల్.ఎ గా కనిపించిన కాసేపు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మహేష్ మెప్పించారు.
6) జూ.ఎన్టీఆర్ :
‘బాద్ షా’ సినిమాలో కూడా రామారావు పాత్ర కోసం ఎన్టీఆర్ తో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడించాడు దర్శకుడు శ్రీను వైట్ల.
7) విజయ్ దేవరకొండ :
‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి ఆకట్టుకున్నాడు.
8) వరుణ్ తేజ్ :
‘ఎఫ్ 2’ , ‘గద్దలకొండ గణేష్’ ‘ఎఫ్3’ వంటి సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అలరించాడు ఈ మెగా హీరో.
9) అల్లు అర్జున్ :
‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ .. ‘గోన గన్నారెడ్డి’ పాత్ర కోసం తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి క్లాప్స్ కొట్టించాడు.
10) రామ్ :
‘జగడం’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాల్లో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.
11) నిఖిల్ :
‘హ్యాపీ డేస్’ సినిమాలో రాజేష్ పాత్ర కోసం తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మెప్పించాడు.
12) విశ్వక్ సేన్ :
‘ఫలక్ నుమా దాస్’ , ‘ఓరి దేవుడా’ చిత్రాల్లో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మెప్పించాడు విశ్వక్.
13) శ్రీహరి :
అప్పట్లో హీరోగా నటించిన శ్రీహరి కూడా ‘ఢీ’, ‘కింగ్’, ‘బృందావనం’ వంటి సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మెప్పించాడు.
14) శ్రీకాంత్ :
‘మహాత్మా’ ,’శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’ వంటి సినిమాల్లో శ్రీకాంత్ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.
15) నితిన్ :
‘ధైర్యం’ సినిమాలో నితిన్ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ కనిపిస్తాడు.
16) గోపీచంద్:
‘వర్షం’ సినిమాలో విలన్ భద్రన్న పాత్ర కోసం తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మెప్పించాడు.
17) నవీన్ పోలిశెట్టి :
‘జాతి రత్నాలు’ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి ఎంటర్టైన్ చేశాడు ఈ యంగ్ హీరో.
18) నాగ చైతన్య :
ఇందాక చెప్పుకున్నాం కదా ‘లవ్ స్టోరీ’ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో చాలా బాగా మాట్లాడాడు.
19) రవితేజ :
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో విక్రమ్ సాగర్ పాత్ర కోసం తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మెప్పించాడు.
20) సిద్దు జొన్నలగడ్డ :
‘డిజె టిల్లు’ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.
21) నాని :
‘దసరా’ సినిమాలో ధరణి పాత్ర కోసం తెలంగాణ స్లాంగ్ చాలా సహజంగా మాట్లాడాడు నాని.
22) ప్రభాస్ :
తన మొదటి సినిమా ‘ఈశ్వర్’ లోనే తెలంగాణ స్లాంగ్ లో చాలా చక్కగా మాట్లాడాడు.
23) రానా :
‘విరాట పర్వం’ సినిమాలో రావన్న పాత్రలో రానా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మెప్పించాడు.