కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తన క్యూట్ లుక్స్, నేచురల్ యాక్టింగ్‌తో యూత్ ఆడియన్స్‌ని ఫిదా చేసింది. ఈ మూవీ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనికి ప్రధాన కారణం రుక్మిణి వసంత్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు.ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) , డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఎన్టీఆర్ 31’లో హీరోయిన్‌గా నటిస్తోంది.
Jr NTR
అలాగే, ‘కాంతార’ సీక్వెల్ ‘కాంతార 2’లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. ‘ఎన్టీఆర్ 31’లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తుండటంతో, ఈ సినిమాతో రుక్మిణి వసంత్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని అందరూ భావిస్తున్నారు. ‘కాంతార’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఒకవేళ ‘కాంతార 2’ కూడా అదే స్థాయిలో హిట్ అయితే, రుక్మిణి కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది.
అయితే, ఇప్పుడు ఈ రెండు భారీ ప్రాజెక్టులే రుక్మిణి కెరీర్ కి కొంత ఇబ్బందిగా మారాయని టాక్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన సినిమాలను చాలా టైమ్ తీసుకుని తెరకెక్కిస్తాడు. ఆయన ఒక సినిమా పూర్తయ్యే వరకు వేరే ప్రాజెక్ట్ టచ్ చేయడు. దీంతో, ఎన్టీఆర్ 31 ఎప్పుడు పూర్తవుతుందో, రిలీజ్ ఎప్పుడో ఎవరికీ క్లారిటీ లేదు. ప్రశాంత్ నీల్ తో కమిట్ అవ్వడం వల్ల రుక్మిణి వసంత్ వేరే ప్రాజెక్ట్స్ చేయడానికి కుదరడం లేదు.
ఆమె డేట్స్ అన్నీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం బ్లాక్ అయ్యాయి. రిషబ్ శెట్టి కూడా సేమ్ కండిషన్ పెట్టారట. ఆ సినిమాలు పూర్తయ్యే వరకు రుక్మిణి వేరే సినిమాలు చేయకూడదు అనేది ఆ కండిషన్. దీంతో, రుక్మిణి సైన్ చేసిన మిగతా నాలుగు ఐదు సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.చిన్న నిర్మాతలు, డైరెక్టర్లు రుక్మిణి కోసం వెయిట్ చేస్తున్నారు.
కానీ, బిగ్ ప్రాజెక్ట్స్ వల్ల వాళ్లకి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఒకేసారి అన్నీ కావాలంటే కుదరదు కదా. ఈ విషయాన్ని రుక్మిణి ముందుగా ఊహించలేకపోయింది. ఇప్పుడు వాళ్లకి ఏం సమాధానం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతోంది. మరి, ఈ బిగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు పూర్తవుతాయో, రుక్మిణి మిగతా సినిమాలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.