Samyuktha Menon, Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్ సినిమాలో సంయుక్త.. అయితే ఒక ట్విస్ట్.!
- October 9, 2024 / 05:00 PM ISTByFilmy Focus
100 శాతం స్ట్రయిక్ రేట్ అనలేం కానీ దాదాపు వంద శాతం స్ట్రయిక్ రేటుతో దూసుకుపోతున్న కథానాయిక సంయుక్త (Samyuktha Menon). తెలుగులోకి ఇలా వచ్చిందో లేదో అలా స్టార్ హీరోయిన్ అయ్యేంతలా విజయాలు అందుకుంది. అయితే వచ్చిన అవకాశాలను వచ్చినట్లు ఓకే చెప్పకుండా.. నేను సగటు హీరోయిన్ కాను అని చెప్పకనే చెప్పింది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని సినిమాలు కూడా ఓకే చేసింది. ఆ సినిమాతో ఆమె లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రపంచంలోకి వచ్చేస్తోంది.
Samyuktha Menon, Lokesh Kanagaraj:

దక్షిణాదిలో ప్రస్తుతం ఉన్న టాప్ దర్శకుల్లో లోకేశ్ కనగరాజ్ ఒకరు. ప్రస్తుతం రజనీకాంత్‌తో (Rajinikanth) ‘కూలీ’ (Coolie) అనే సినిమా చేస్తున్నారు. మరోవైపు నిర్మాతగానూ ఓ సినిమా చేస్తున్నారు. లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఆ సినిమా ‘బెంజ్’. బక్కియరాజ్ కణ్నణ్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. ఇందులో కథానాయికగా సంయుక్తను ఓకే చేశారు అని చెబుతున్నారు. ఈ సినిమా కూడా లోకేశ్ ప్రపంచంలోనే ఉంటుంది అంటున్నారు.

ప్రస్తుతం సంయుక్త చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. మరోవైపు ఆమె నిర్మాత అవుతుంది అని సమాచారం. ఇటీవల ఆమె దగ్గరకు హీరోయిన్ ఓరియెంటెడ్ కథ వచ్చిందట. అది నచ్చడంతో ఏకంగా నిర్మాణ భాగస్వామి అవుతా అంటోందట. నిర్మాత రాజేష్ దండా (Rajesh Danda) గత కొన్ని నెలలుగా ఓ కథను సిద్ధం చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంతతో (Samantha) ఆ సినిమా చేయాలనేది ఆయన ఆలోచన. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేశారు.

కానీ సమంత ఇప్పుడు ఆ మూడ్‌లో లేదు అంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టుల మీదకు ఆమె చూపు మళ్లుతోంది. దీంతో అనదర్ ఆప్షన్‌గా సంయుక్తను సంప్రదిస్తే.. ఆమె ఏకంగా నిర్మాణ భాగస్వామి అవుతాను అంటోంది. మరి అంతలా ఆ కథలో ఏముంది, రాజేశ్ దండా అంతగా ఏం రాయించారు అనేది చూడాలి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దసరా సందర్భంగా సినిమాను అనౌన్స్ చేస్తారు అని టాక్.














