సరైనోడు విజయంతో అల్లు అర్జున్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహం తోనే బన్నీ “చెప్పను బ్రదర్” అంటూ పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు పవన్, బన్నీ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పవర్ స్టార్ కి పోటీగా స్టైలిష్ స్టార్ కష్టపడుతున్నాడు. అందుకే గబ్బర్ సింగ్ డైరక్టర్ తో డీజే సినిమా చేశారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ పవన్ కాటమరాయుడు చిత్ర టీజర్, ట్రైలర్ ని మించి పోయింది. ఈ విధంగా గట్టి పోటీ ఇస్తున్న బన్నీ.. సినిమా రిలీజ్ విషయంలోనూ పవన్ రికార్డ్ ని బీట్ చేయాలనుకున్నారు. కానీ ఆ విభాగంలో గెలవలేక పోయారు. ‘కాటమరాయుడు’ విదేశాల్లో దాదాపు 450-500 మధ్య స్క్రీన్లలో రిలీజవగా.. ‘డీజే’ 300 స్క్రీన్లలోనే విడుదలవుతోంది.
బన్నీ కెరీర్లో ఇదే రికార్డు. తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్లో కీలకమైన అమెరికాలో ‘డీజే’ను 160 లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నట్లుగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది. కాటమరాయుడు’ అక్కడ 260 లొకేషన్లలో విడుదల చేశారు. ‘కాటమరాయుడు’తో పోలిస్తే ‘డీజే’కు క్రేజ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఈ సినిమాను పవన్ మూవీతో పోలిస్తే తక్కువ స్క్రీన్లలోనే రిలీజ్ చేస్తుండటం పవన్, బన్నీల మధ్య తేడాని స్పష్టం చేస్తోంది. మరి వసూళ్ల విషయంలో నైనా కాటమరాయుడు ని దువ్వాడ జగన్నాథం బీట్ చేస్తాడా? లేదా? చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.