‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు. అది ఏమాత్రం తప్పుకాదు.. తన స్టార్ ఇమేజ్ కు తగ్గట్టు పెద్ద సినిమాలు చేయడంలో తప్పే లేదు. కానీ ఒకటి రెండు సినిమాల అనుభవం కలిగిన దర్శకులకే రూ.300 కోట్లు, రూ.400 కోట్లు, రూ.500 కోట్ల భారీ బడ్జెట్ ప్రాజెక్టులను కట్టపెట్టేస్తున్నాడు. తద్వారా ఆ సినిమాలు భారీ నష్టాలనే మిగులుస్తున్నాయి.ఇప్పుడు కూడా అలాంటి ప్రాజెక్టులే చేస్తున్నాడు. అందులో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు.
‘శక్తి’ తో పెద్ద దెబ్బ తిన్నప్పటికీ ‘వైజయంతీ మూవీస్’ కి భారీ బడ్జెట్ సినిమాల పై వ్యామోహం తగ్గలేదు.సరే ఈ ‘ప్రాజెక్టు కె’ లో చాలా విశేషాలు ఉన్నాయి.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ కాగా… ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమితాబ్ పాత్ర ఏంటి? అతని పాత్ర పేరు ఏంటి? అనే విషయాలు తాజాగా బయటకి వచ్చాయి. ఈ భారీ బడ్జెట్ మూవీలో బిగ్ బి.. అశ్వద్ధామ పాత్రని పోషిస్తున్నారట.
పురాణాల గురించి తెలిసిన వారికి ఈ పాత్ర పరిచయమే.చావే లేని వాళ్ళుగా ఆంజనేయుడు, అశ్వద్ధామ ల గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. ఇప్పటికీ వీళ్ళు బ్రతికే ఉన్నారు అనేది కొంతమంది నమ్మకం. ఆంజనేయుడు ఇంకా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని చెప్పేవాళ్ళు నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఒకవేళ అశ్వద్ధామ కూడా బ్రతికి ఉంటే ఎలా ఉంటుంది..? అనే థీమ్ తో అమితాబ్ అశ్వద్ధామ పాత్రని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇలాంటి పురాణ పాత్రల ఇందులో ఇంకా ఉన్నాయట.చెప్పుకోవడానికి అమితాబ్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సినిమా పై ఆసక్తిని కూడా కలిగిస్తుంది. మరి మిగిలిన పాత్రలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి కూడా అమితాబ్ పాత్ర గురించి తెలిసిన తర్వాత ఎక్కువైంది.