ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ మరో రెండు వారాల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రభాస్ గత సినిమా సాహో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. హీరో ప్రభాస్ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.
క్లాస్ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ లో హార్ట్ టచింగ్ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని సమాచారం. అయితే ఈ సినిమాలోని ఒక సీన్ లో ప్రభాస్ ఏడవకుండానే ప్రేక్షకులను ఏడిపిస్తారని సమాచారం. గతంలో మాస్ సినిమాలు ఎక్కువగా చేసిన ప్రభాస్ ప్రస్తుతం రూటు మార్చారు. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలలో నటించడానికి ప్రభాస్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో వేగం పెరిగింది. ఈ సినిమా ట్రైలర్ కు తెలుగులో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
వ్యూస్ పరంగా రాధేశ్యామ్ ట్రైలర్ రికార్డులను క్రియేట్ చేసింది. సినిమాలో ఒక సీన్ లో హీరోయిన్ చనిపోతారని ఆ సీన్ లో ప్రభాస్ పర్ఫామెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం. రాధేశ్యామ్ ఫైనల్ కట్ ను చూసిన ప్రభాస్ సంతోషంగా ఫీలయ్యారని బోగట్టా. బాహుబలి2 తర్వాత ఆ స్థాయి హిట్ రాధేశ్యామ్ తో సాధిస్తానని ప్రభాస్ నమ్మకంతో ఉన్నారు. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించగా ప్రభాస్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన తొలి మూవీ రాధేశ్యామ్ కావడం గమనార్హం.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేశారని బోగట్టా. రాధేశ్యామ్ మూవీ కోసం బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.