యాంకర్ అశ్వినీ శర్మ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చాలా సినిమా ఈవెంట్లకు ఈమె హోస్ట్ గా వ్యవహరించింది. చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ కూడా చేసింది. కొన్నాళ్లుగా ఈమె షోలకు వాటికి దూరంగా ఉంటుంది. అయితే యూట్యూబ్ ద్వారా మాత్రం ఈమె తన అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఈమెకు పెళ్ళైన సంగతి తెలిసిందే. ప్రతీక్ అనే సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ను ఈమె పెళ్లి చేసుకుని యూ.ఎస్ లో సెటిల్ అయ్యింది.
అందువల్ల ఈమె టీవీ షోలలో ఎక్కువ కనిపించడం లేదు. అశ్వినీ త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. వాలెంటైన్స్ డే రోజున అభిమానులతో ఆమె ఈ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది. అలాగే తన సీమంతం ఫోటోలను కూడా షేర్ చేసింది. ‘మేము మా ఫస్ట్ బేబీకి జన్మనివ్వబోతున్నాము. మా లిటిల్ బేబీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
మా బేబీకి అలాగే మా ఫ్యామిలీకి మీ బ్లెస్సింగ్స్ కావాలి.’ అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ. అశ్వినీ సీమంతం ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :