అన్ని జోనర్లకంటే కష్టమైన జోనర్ కామెడీ అనే చెప్పాలి. జనాలను నవ్వించడం అంత ఈజీ కాదు. మాములుగా కమర్షియల్ ఫిలిమ్స్ లో కామెడీ ట్రాక్స్ రాయడానికే కష్టపడుతుంటారు. అలాంటి కామెడీ ఫిల్మ్ అంటే సినిమా అంతా నవ్వించడానికి కష్టపడాల్సి ఉంటుంది. అప్పట్లో జంధ్యాల, ఈవీవీ లాంటి దర్శకులు కామెడీ సినిమాలను తెరకెక్కించి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ జెనరేషన్ లో అయితే అనిల్ రావిపూడి ఆ ఫీట్ ను అందుకునేలా ఉన్నారు.
ఆయన ఎలాంటి కథను ఎన్నుకున్నా.. చాలా వినోదాత్మకంగా చెబుతుంటారు. అతడి కామెడీ కోసమే జనాలు థియేటర్లకు వస్తుంటారు. ‘ఎఫ్2’ సినిమాతో తనలో ఫన్ యాంగిల్ ఏ రేంజ్ లో ఉందో చూపించారు అనిల్ రావిపూడి. ఇప్పుడు ‘ఎఫ్3’తో ఆడియన్స్ ను మరింత ఎంటర్టైన్ చేయనున్నారు. నిజానికి ఈ సినిమా పూర్తయి చాలా కాలమవుతుంది. కానీ సరైన రిలీజ్ డేట్ దొరక్క సమ్మర్ కి వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ గా మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలో కావాల్సినన్ని ఫన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. మొత్తంగా ఆరు కామెడీ ఎపిసోడ్లు థియేటర్లో నవ్వులు పూయిస్తాయని తెలుస్తోంది. అందులో రాంబోగా అలీ ఎపిసోడ్ అయితే హైలైట్ గా నిలుస్తుందట. జూనియర్ ఆర్టిస్ట్ గా వెన్నెల కిషోర్ కామెడీ.. కథలో వెంకటేష్ రేచీకటిని, వరుణ్ తేజ్ నత్తిని వాడుకున్న విధానం ప్లస్ అయిందని అంటున్నారు. తమన్నా రోల్ కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ అవుతుందని..
క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసినట్లు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ చూసి.. ఆడియన్స్ పగలబడి నవ్వుతారని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో సరైన కామెడీ సినిమాలు రావడం లేదు కాబట్టి ‘ఎఫ్3’ క్లిక్ అయితే గనుక కలెక్షన్స్ ఓ రేంజ్ లో రావడం ఖాయం!