ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేషియో ఉన్న దర్శకులతో అనీల్ రావిపూడి (Anil Ravipudi) టాప్ లిస్టులో ఉన్నారని చెప్పవచ్చు. పటాస్ (Pataas) నుండి భగవంత్ కేసరి (Bhagavanth Kesari) వరకు అన్ని సినిమాలు కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. ఇక సంక్రాంతి లో అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమాలు మంచి హిట్ అవుతాయని చెప్పవచ్చు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) పై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా పూర్తిగా కామెడీ, ఎమోషనల్ డ్రామాగా ఉంటుందని సమాచారం.
Anil Ravipudi
వెంకటేష్ అభిమానులను ఆకట్టుకునేలా అనీల్ ఈ కథను తీర్చిదిద్దినట్లు టాక్. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో అనీల్ తను చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌లు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ దాదాపుగా ఫిక్స్ అయినట్లు ఒక క్లారిటీ ఇచ్చారు. చిరంజీవికి అనీల్ ఒక లైన్ చెప్పగా, అది మెగాస్టార్‌కు నచ్చడంతో ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ కాంబోపై మెగా అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఇదే కాకుండా మరో సీనియర్ హీరో నాగార్జునతో సినిమా చేయాలని అనీల్ ఆసక్తిని వ్యక్తం చేశారు. అనీల్, నాగార్జున కాంబినేషన్‌లో హలో బ్రదర్ తరహాలో సినిమా వస్తే అక్కినేని అభిమానులకు పండగే. హలో బ్రదర్ సినిమాలో డబుల్ రోల్ చేసిన నాగార్జునకు, అలాంటి కథ మళ్లీ ఫిట్ అవుతుందని అనీల్ భావిస్తున్నారు. ఒకవేళ ఇది సెట్టయితే, ప్రేక్షకులకు రెండు డబుల్ డోస్ యాక్షన్, కామెడీకి అవకాశం ఉంటుంది.
ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అనీల్ సక్సెస్ రేసులో ఉన్నారు. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ (Game Changer) (రామ్ చరణ్) (Ram Charan) , డాకు మహారాజ్ ’(Daaku Maharaaj) (బాలకృష్ణ) (Nandamuri Balakrishna) సినిమాలు పోటీగా వస్తున్నాయి. ఈ మూడు పెద్ద సినిమాల మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. అయితే అనీల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ తో మినిమమ్ వసూళ్ళను అందుకునే ఛాన్స్ ఉంది.