టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకులలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈయన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇకపోతే తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి ఈ కార్యక్రమంలో భాగంగా తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టమని అయితే ఆ ఇష్టం తనతో పాటు పెరిగి పెద్ద అయిందని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ క్రమంలోనే బీటెక్ పూర్తి కాగానే తన బాబాయ్ అరుణ్ ప్రసాద్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల తాను కూడా ఇండస్ట్రీ వైపు వచ్చానని అనిల్ రావిపూడి తెలిపారు.
అలా సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణం అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైందని అనంతరం రైటర్ గా తన ప్రయాణం కొనసాగిందని తెలిపారు. అప్పట్లో తనకు సాలరీ చాలా తక్కువగా వచ్చేదని వచ్చే డబ్బులు సరిపోయేది కాదు అని తెలిపారు. హైదరాబాద్ లో తన అక్క, పెదనాన్న వాళ్ళు ఉండటం వల్ల తనకు పెద్దగా డబ్బుకు తిండికి ఇబ్బంది పడలేదని అనిల్ తెలిపారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నిర్మాత దిల్ రాజు తనకు వెల్ విషర్ అని తెలిపారు.
ఇకపోతే తన సినీ కెరియర్ కు తన బాబాయ్ అరుణ్ ప్రసాద్ తన గాడ్ ఫాదర్ అని, తనకు ఇండస్ట్రీలో తన బాబాయ్ ప్రోత్సాహం ఎంతో ఉందని,ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన సినీ కెరీర్ గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.