సౌత్ ఇండియాలో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ (Anirudh Ravichander) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. దేవర (Devara) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనిరుధ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దేవర అవెంజర్స్, బ్యాట్ మ్యాన్ సినిమాలను గుర్తు చేసిందని అనిరుధ్ పేర్కొన్నారు. దేవర సినిమాకు బీజీఎం అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయానని అనిరుధ్ తెలిపారు. ఇంత గొప్పగా దేవర సినిమాను ఎలా తెరకెక్కించారని ఆశ్చర్యానికి గురయ్యానని అనిరుధ్ పేర్కొన్నారు.
Anirudh Ravichander
దేవర మూవీ అద్భుతమైన యాక్షన్ డ్రామా అని అనిరుధ్ కామెంట్లు చేశారు. దేవర లాంటి సినిమాలకు బీజీఎం అందించాలంటే మంచి ప్రయోగాలు చేయొచ్చని అనిరుధ్ వెల్లడించారు. దేవర మూవీకి సంబంధించి 95 శాతం రీరికార్డింగ్ పనులను ఓవర్సీస్ లో పూర్తి చేశామని అనిరుధ్ చెప్పుకొచ్చారు. దేవర సినిమా చూసిన సమయంలో హాలీవుడ్ సినిమాలను చూసిన అనుభూతి కలిగిందని అనిరుధ్ కామెంట్లు చేశారు. దేవర సినిమాలో మ్యూజిక్ కు ప్రత్యేక స్థానం ఉందని అనిరుధ్ వెల్లడించారు.
ఎమోషన్, డ్రామా, యాక్షన్, ఆవేశం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారని అనిరుధ్ కామెంట్లు చేశారు. దేవర సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. మేము ఈ సినిమాను ఎంత ఎంజాయ్ చేశామో వారు కూడా అంతే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని అనిరుధ్ కామెంట్లు చేశారు.
దేవర సినిమా 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా టాక్ ఆధారంగా ఈ సినిమా బుకింగ్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని చెప్పవచ్చు. దేవర మూవీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి మూవీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.