“పుష్ప 2” (Pushpa 2) అనంతరరం అల్లు అర్జున్ (Allu Arjun) తదుపరి సినిమా గురించి ఎనౌన్స్మెంట్ వస్తుందా అని బన్నీ అభిమానులతోపాటు ఇండియా వైడ్ సినిమా అభిమానులు కూడా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అట్లీతో (Atlee Kumar) సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అని టాక్ వినిపిస్తున్నప్పటికీ.. ఆ సినిమా కంటే కూడా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే సినిమా మీదే ఎక్కువ దృష్టి ఉంది జనాలకి. ఇప్పటికే ఈ సినిమా మైథలాజికల్ టచ్ ఉన్న చిత్రమని, తెలుగులో ఇప్పటివరకు ఎవ్వరూ పెట్టనంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే పలు వార్తలు హల్ చల్ చేస్తూ వస్తున్నాయి.
అయితే.. ఇటీవల తమిళ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ రంగన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ (Suryadevara Naga Vamsi) మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ సినిమా మైథలాజికల్ టచ్ ఉన్న చిత్రమనేది అందరికీ తెలిసిందే. అయితే.. ఈ సినిమాని చాలా తక్కువమందికి తెలిసిన ఒక దేవుడి జీవితాన్ని ఆధారంగా తెరకెక్కించనున్నామని, ఆ దేవుడు గురించి కొందరికి తెలిసినప్పటికీ, ఆయన జర్నీ ఏమిటి అనేది చాలామందికి తెలియదు, దాన్ని ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేస్తున్నామని నాగవంశీ చెప్పుకొచ్చాడు.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 43వ పుట్టినరోజు సందర్భంగా అట్లీతో సినిమా కి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుండగా.. అదే రోజు త్రివిక్రమ్ సినిమా గురించి కూడా ఫార్మల్ పోస్టర్ రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతుంది సితార సంస్థ. అట్లీ-బన్నీ సినిమాకి 700 కోట్ల బడ్జెట్ కేటాయించింది సన్ పిక్చర్స్ సంస్థ, మరి త్రివిక్రమ్-బన్నీ సినిమాకి సితార సంస్థ ఎంత బడ్జెట్ ను కేటాయించనుంది అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే.. బన్నీ బాలీవుడ్ ఎంట్రీపై కూడా ఏప్రిల్ 8న చిన్నపాటి క్లారిటీ ఇవ్వనున్నారని వినికిడి.
— VVK (@VKrishna_V) March 25, 2025