పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరో మైథలాజికల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘హనుమాన్’ (Hanuman) సినిమాతో క్రేజీ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ వర్మ (Prasanth Varma), తన మైథలాజికల్ యూనివర్స్‌ను విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడని టాక్. అదే క్రమంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓ భారీ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని, దీనికి ‘బక’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD), ‘సలార్ 2’, ‘రాజా సాబ్’ (The Rajasaab) లాంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, మరో పౌరాణిక కథను ఎంచుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మహాభారతంలోని బకాసురుడి కథ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా, మరింత కొత్తగా మలచనుందని అంటున్నారు. అయితే ఇది ఓ డార్క్ ఫాంటసీ మూవీగా రూపొందుతుందని, ఇందులో ప్రభాస్ పాత్ర పూర్తి భిన్నంగా ఉండబోతుందని టాక్.
ప్రశాంత్ వర్మ ఇప్పటికే ‘జై హనుమాన్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే యూనివర్స్‌లో మరో సినిమాగా ‘బక’ను కూడా తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో, ప్రభాస్ పాత్ర విషయంలో క్లారిటీ వచ్చే వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకూడదని చిత్రబృందం నిర్ణయించుకుందట.
పౌరాణిక కథలను ఎప్పుడూ కొత్త యాంగిల్‌లో చూపించడమే ప్రశాంత్ వర్మ ప్రత్యేకత. ‘హనుమాన్’లో విజువల్ గ్రాండియర్, ఎమోషనల్ డ్రామా, పవర్‌ఫుల్ సూపర్ హీరో మూమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేశారు. అదే విధంగా, ‘బక’ కూడా అదే తరహాలో ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇది అధికారికంగా ఫిక్స్ అయ్యిందా? ప్రభాస్ నిజంగానే ఇందులో నటిస్తున్నాడా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.