దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలు చరిత్రను లిఖించాయి. అనేక రికార్డులను సృష్టించాయి. బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా 13,000 తెరలపై విడుదలై విశేష ఆదరణ అందుకుంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1,800 కోట్లను వసూలు చేసి ఔరా అనిపించింది. ఇది నాలుగు భాషల్లో వచ్చిన వసూళ్లు. కేవలం తెలుగు వెర్షన్ కూడా భారీ కలక్షన్స్ నమోదు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాహుబలి ది కంక్లూజన్ 197.3 కోట్లను వసూలు చేసింది. నైజాం నుంచి 66.60 కోట్లు, సీడెడ్ 34.75 కోట్లు, నెల్లూరు 8.05 కోట్లు, గుంటూరు 18.05 కోట్లు, కృష్ణా 14.05 కోట్లు, వెస్ట్ 12.3 కోట్లు, ఈస్ట్ 17 కోట్లు.. ఉత్తారంధ్ర 26.5 కోట్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 197.3 కోట్లు వసూలు కాగా.. కర్నాటకతో సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి 51.4 కోట్లు.. ఓవర్సీస్ నుంచి 60.70 కోట్లను కొల్లగొట్టింది. ఇండియాలోనే బాహుబలి2 తెలుగు వెర్షన్ 248.7 కోట్లను వసూలు చేయగలిగితే.. ప్రపంచవ్యాప్తంగా 309.4 కోట్లుగా నమోదైంది. బాహుబలి బిగినింగ్ దేశవ్యాప్తంగా 149.15 కోట్ల షేర్ ను వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 183.65 కోట్లు రాబట్టింది. బాహుబలి రెండు పార్ట్ లు కేవలం తెలుగు వెర్షన్ కే ప్రపంచవ్యాప్తంగా 493.05 కోట్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.