మళ్లీ థియేటర్లలో రిలీజ్ కానున్న బాహుబలి!
- September 22, 2017 / 12:48 PM ISTByFilmy Focus
తెలుగు ప్రజలందరినీ గర్వపడేలా చేసిన సినిమా బాహుబలి. బాహుబలి బిగినింగ్ కలక్షన్ల సునామీ ప్రారంభించగా బాహుబలి కంక్లూజన్ ముగించింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఇందులో నటించిన ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ లకు అధిక సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఇలా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాలు మళ్ళీ రిలీజ్ కాబోతున్నాయి.
అయితే ఆరుగంటల నిడివి ఉండదు. మూడు గంటలు మాత్రమే ఉంటుంది. అంటే రెండు సినిమాల్లోని అవసరంలేని సీన్లను ఎడిట్ చేసి మూడు గంటలు చేసే పనిలో ఎడిటర్లు ఉన్నారు. కథ మొత్తాన్ని ఒకే సినిమాగా చెప్పడానికి కష్టపడుతున్నారు. ఎప్పటి లోపున ఎడిట్ పూర్తి అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయాల్లో క్లారిటీ రాగానే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















