సహజంగా తెలుగు తెరపై నట సింహం ఒక పాత్రలో కనిపిస్తేనే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలైపోతాయి, అలాంటిది అదే నట సింహం రెండు పాత్రల్లో తెలుగు తెరపై సాక్షాత్కరిస్తే ఇంకేముంది సింహ ఘర్జన మొదలైనట్లే. ఇంతకీ ఈ కధ అంతా ఏంటి అంటారా అయితే ఈ స్టోరీ వినాల్సిందే. నందమూరి అంత సింహం బాలయ్య గతంలో చాలా సినిమాల్లో రెండు పాత్రల్లో కనిపించి అభిమానులనే కాదు, ప్రేక్షక దేవుళ్ళను కూడా మెప్పించాడు. అయితే అప్పుడప్పుడు మూడు క్యారెక్టర్స్ సైతం వేసిన బాలయ్యకు సెంటిమెంట్ గా చూసుకుంటే ద్విపాత్రాభినయం బాగా కలసి వచ్చింది. ఇక అదంతా పక్కన పెడితే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి నట సింహం బాలయ్య 100వ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. దీనిపై ఉగాది శుభదినమున బాలయ్య అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. “గౌతమి పుత్ర శాతకర్ణ” చారిత్రక కధతో బాలయ్య అభిమానులను అలరించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య ఒక్క పాత్రలో కాకుండా రెండు పాత్రలో కనిపించనున్నారంట. ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం మీస కట్టు పెంచుతూ బాలయ్య ఇప్పటికే సిద్దం అవుతూ ఉండగా ఇది కాకుండా ఒక కుర్రాడి గెటప్ లో ఆయన కనిపిస్తాడు అంటున్నారు. ఒక పాత్ర వర్తమానం లో మరొక పాత్ర చారిత్రకం లో రాజుగా కనిపిస్తుంది అని ఈ చిత్ర దర్శకుడు, జాతీయ స్థాయి లో అవార్డు అందుకున్న క్రిష్ తెలిపినట్లు సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి ఒక చారిత్రక పాత్రలో, మరొక వర్తమాన పాత్రలో ఇప్పటికే ఆదిత్య369అనే సైంటిఫిక్ చిత్రాన్ని బాలయ్య చేశారు. ఇక అదే తరహా సినిమా అయితే మరోసారి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.