Bhagyashree Borse: షాకిస్తున్న భాగ్య శ్రీ రెమ్యునరేషన్.. ఎన్నాళ్ళు సాగుతుందో?
- August 21, 2024 / 09:55 AM ISTByFilmy Focus
ఆగస్టు 15 ని టార్గెట్ చేసి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రిలీజ్ కి ముందు అందరికీ ఫస్ట్ ఛాయిస్ అంటే ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. దానికి కారణాలు లేకపోలేదు. ఒకటి రవితేజ (Ravi Teja) – హరీష్ శంకర్ (Harish Shankar) ..ల కాంబినేషన్ అయితే, మరొకటి మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) సంగీతంలో రూపొందిన పాటలు. ఇక మరో కారణం అంటే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) అని చెప్పాలి. లిరికల్ సాంగ్స్ లో ఎక్కువగా హైలెట్ అయ్యింది ఈ అమ్మడి గ్లామరే..!
Bhagyashree Borse

హీరోయిన్ ను అందంగా చూపించడంలో దర్శకుడు హరీష్ శంకర్ సిద్ధహస్తుడు. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) విషయంలో కూడా అతను వంద శాతం డ్యూటీ చేశాడు అని చెప్పాలి. సినిమాకి హైలెట్ అంటే భాగ్య శ్రీ బోర్సే అనే చెప్పాలి. ‘సితార్’ ‘జిక్కి’..వంటి పాటల్లో ఈ అమ్మడు వడ్డించిన అందాల గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ తో భాగ్య శ్రీ డిమాండ్ బాగా పెరిగింది. టాలీవుడ్లో రూపొందే పెద్ద ప్రాజెక్టులకి ఈ అమ్మడు ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.

ఈ క్రమంలో ఆమె పారితోషికం కూడా పెంచేసినట్టు సమాచారం. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కోసం భాగ్య శ్రీ బోర్సే కి రూ.20 లక్షలు పారితోషికం ఇచ్చారట. ఇప్పుడు ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూలు కడుతుండటంతో కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘మైత్రి’ సంస్థల్లో సినిమాలు చేయడానికి భాగ్య శ్రీ ఓకే చెప్పినట్టు వినికిడి.
















