ఓ పక్క రీమేక్ చేస్తున్నాడు.. మరోపక్క రీమేక్ ఇస్తున్నాడు..!

వరుసగా మూడు ప్లాప్ లు ఫేస్ చేస్తున్న టైములో ‘భీష్మ’ చిత్రంతో హిట్ అందుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కరోనా ఎఫెక్ట్ కనుక లేకపోతే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్లోకి రీమేక్ చేయబోతున్నారట.

Bheeshma movie thanks meet in vizag

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ చిత్రం రైట్స్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. రన్బీర్ కపూర్, వరుణ్ దావన్, టైగర్ ష్రాఫ్ వంటి యంగ్ హీరోలలో ఒకరితో ఈ రీమేక్ ను రూపొందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడట. ఈ మధ్య మన సినిమాలకు అక్కడ ఆదరణ ఎక్కువవడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇక మరో పక్క నితిన్.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.