ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కి ఒకింత నిరాశ మిగిల్చాడు. ఆయన ఏకంగా రెండేళ్లు వెండితెరకు దూరమై వారిని ఇబ్బంది పెట్టారు. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభం నుండి మహా అయితే ఓ ఏడాది సినిమా చేయకుండా గ్యాప్ ఇచ్చారు. ఇలా రెండేళ్లు వెండి తెరకు ఆయన దూరమైన సందర్భం లేదు. ఐతే 2021 లో ఆయం బ్యాక్ టు బ్యాక్ ట్రేట్స్ సిద్ధం చేస్తున్నారు. తక్కువ గ్యాప్ లో ఆయన ఆర్ ఆర్ ఆర్ తో పాటు త్రివిక్రంతో చేస్తున్న ఆయన 30వ చిత్రం విడుదల చేయనున్నారు.
ఆర్ ఆర్ ఆర్ జనవరి 8, 2021న విడుదల కానుండగా, త్రివిక్రమ్ మూవీ ఏప్రిల్ లో విడుదల అవుతుంది. కాగా ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికర అంశం ఒకటి ఉంది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం చేస్తున్న ఎన్టీఆర్ దాని కోసం బాగా జట్టు మరియు కోరమీసం పెంచారు. కొమరం భీమ్ కి పోలిక కోసం ఎన్టీఆర్ అలా తయారు కావడం జరిగింది. మరి త్రివిక్రమ్ మూవీ సమకాలీన పరిస్థుల నేపథ్యంలో తెరకెక్కనున్న మోడరన్ మూవీ.
మే నుండి మొదలుకావాల్సిన త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ లో ఎలా పాల్గొంటాడు అనేది ఆసక్తికర అంశం. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చిత్రీకరణ ఇంకా 30%శాతం వరకు ఉంది, మరి ఎన్టీఆర్ తన మీసం, కానీ జుట్టు కానీ తగ్గించలేని పరిస్థితి. భిన్న నేపద్యాలు కలిగిన ఈ రెండు చిత్రాల కోసం త్రివిక్రమ్ ఎన్టీఆర్ లుక్ ఎలా సెట్ చేస్తాడు అనేది ఎప్పుడు ఓ ప్రశ్నగా ఉంది. త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ ల ముందున్న అసలు సవాల్ కూడా అదే.