బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా పాపులర్ అయిన వారిలో కాస్త ఎక్కువగా విన్న పేరు వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ బ్యూటీల్లో ఈమె కూడా ఒకరు. షోలో తన అందచందాలతో మరింత పాపులారిటీని క్రియేట్ చేసుకుంది వాసంతి. బిగ్ బాస్ హౌస్‌లో తన గ్లామర్‌తో మెప్పించిన ఈ బ్యూటీ బయటకు వచ్చిన తరువాత కూడా తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు కునుకు చేకుండా చేస్తుంది.
అలాంటి ఈమె ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకొని కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అనే వ్యక్తితో వాసంతి ఎంగేజ్‌మెంట్ జరిగింది. వారిద్దరూ ప్రేమించి ఆపై పెద్దలను ఒప్పించి ఒకటి కాబోతున్నారు. ఈ వేడుకకు బిగ్ బాస్ సెలబ్రిటీస్ అంతా వచ్చారు. అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, శ్రీసత్య, ఇనాయ సుల్తానా, ఆర్జే సూర్య, యాంకర్ ధనుష్ అంతా వెళ్లి సందడి చేశారు. తిరుపతిలోని తాజ్ హోటల్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది.
వాసంతి (Vasanthi) సిరిసిరి మువ్వలు అనే సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే గోరింటాకు, గుప్పెడంత మనసు సీరియల్స్ లో కూడా ఈమె నటించింది. గుప్పెడంత మనసులో రిషిని మొదట ప్రేమించే అమ్మాయి సాక్షి రోల్ లో వాసంతి మొదట నటించింది. కాలిఫ్లవర్ అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. వాంటెడ్ పండుగాడు, భువన విజయం, సిఎస్ఐ సనాతన్ అనే మూవీస్ లో కూడా నటించింది. ఎందులో చేసిన కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
కానీ బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ మెట్ గా మాత్రం అందరి హృదయాలను దోచేసింది ఈ అమ్మడు. ఇక ఈ ఎంగేజ్మెంట్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసేసరికి నెటిజన్స్ విషెస్ చెప్తూనే ఆశ్చర్యపోతున్నారు. “వాసంతి అక్కకు అప్పుడే పెళ్లా, మా వాసంతి అక్కను బాగా చూసుకోండి” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వాసంతికి కాబోయే భర్త కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తే. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఆ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి అని ఇండ్రస్ట్రీ టాక్.